Sekhar Master: అలాంటి కామెంట్స్ పెడతారా ?? శేఖర్ మాస్టర్ ఎమోషనల్

Updated on: Apr 29, 2025 | 6:45 PM

ఈ మధ్యన తన డ్యాన్స్ స్టెప్పుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు శేఖర్ మాస్టర్. డాకు మహారాజ్, రాబిన్ హుడ్ సినిమాల్లో అతను కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు అసభ్యకరంగా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపించాయి. వీటి సంగతి పక్కన పెడితే ఇటీవల ఓ మహిళ డ్యాన్సర్ విషయంలో శేఖర్ మాస్టర్ ప్రవర్తించిన తీరును కొందరు ట్రోల్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించాడు శేఖర్ మాస్టర్. ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సాంగ్స్ కాంట్రవర్సీ, హుక్ స్టెప్పుల మీద ట్రోలింగ్, మహిళా డ్యాన్సర్ ఉన్న ఇష్యూస్ గురించి స్పందించాడు. ఓ కొరియోగ్రాఫర్‌గా వర్క్ విషయంలో కాస్త టెన్షన్ ఉంటుంది. కానీ టీవీ కార్యక్రమాలకు వచ్చేసరికి అలాంటిదేమీ ఉండదు. టీవీ షోల్లో జడ్జి‌గా వ్యవహరించడం కాస్త రిలాక్స్‌డ్ గా అనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల ఓ డ్యాన్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా డ్యాన్సర్‌ విషయంలో చాలా విమర్శలు ఎదురయ్యాయి. నిజం చెప్పాలంటే, ఆ సీజన్‌లో పాల్గొన్న మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఆమె చాలా బాగా డ్యాన్స్‌ చేసిందనిపించింది. అందుకే ఆమెను మెచ్చుకున్నా. కానీ దానిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చారు శేఖర్ మాస్టర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు

యుద్ధ ట్యాంకులు, తుపాకుల మోతలు.. NTRతో నీల్ దిమ్మతిరిగే యాక్షన్ స్కెచ్

Vijay Deverakonda: అల్లు అర్జున్‌కు విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌

చెట్టు మీది నుంచి దూకిన అభిమాని.. షాకైన విజయ్‌ దళపతి

ఇండస్ట్రీ డార్క్‌ సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్