ఎందుకంత కన్‌ఫ్యూజన్‌.. ఇంతకీ పండక్కి వచ్చేదెవరు

Updated on: Nov 05, 2025 | 6:13 PM

సంక్రాంతికి భారీ చిత్రాల విడుదలపై కొనసాగుతున్న గందరగోళం. చిరంజీవి చిత్రం షూటింగ్ దాదాపు పూర్తైంది. రవితేజ కొత్త సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభాస్ తన చిత్రం నిర్ధారిత తేదీకి విడుదల అవుతుందని స్పష్టం చేశారు. నవీన్ పోలిశెట్టి కూడా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. పండక్కి ఏ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయో తెలుసుకుందాం.

సంక్రాంతి పండుగకు తెలుగు సినీ అభిమానుల్లో భారీ చిత్రాల విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత పలు సినిమాలు వాయిదా పడ్డాయని వార్తలు వచ్చినా, తాజా సమాచారం ప్రకారం కొన్ని చిత్రాలు పండక్కి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చిత్రం సంక్రాంతికి పక్కాగా విడుదల కానుందని తెలుస్తోంది. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రజలు ఈ కాంబో చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు

Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌

వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ