Sandeep Reddy Vanga: చెవులు దొబ్బాయా.. అది హాలీవుడ్ రిమేక్‌ కాదురా బాబు..
Sandeep Reddy

Sandeep Reddy Vanga: చెవులు దొబ్బాయా.. అది హాలీవుడ్ రిమేక్‌ కాదురా బాబు..

Edited By: TV9 Telugu

Updated on: May 11, 2024 | 3:39 PM

సోషల్ మీడియాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ గుస్సా అవుతున్నారు. చెవులు దొబ్బాయా.. స్పిరిట్ సినిమా హాలీవుడ్ రిమేక్ కాదురా బాబు అంటూ.. సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంగ్లీష్లో స్పిరిట్ గురించి ..

సోషల్ మీడియాలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ గుస్సా అవుతున్నారు. చెవులు దొబ్బాయా.. స్పిరిట్ సినిమా హాలీవుడ్ రిమేక్ కాదురా బాబు అంటూ.. సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంగ్లీష్లో స్పిరిట్ గురించి .. ఆ స్టోరీ స్ట్రైకింగ్ గురించి చెప్పారు. మొదట ప్రభాస్ ఓ హాలీవుడ్ సినిమా రిమేక్ చేయమని తనని పిలిచాడని.. కానీ దానికి తాను ఎగ్టైట్ అవలేనని చెప్పా అన్నారు. ఆ తరువాత యానిమల్ రాస్తున్న టైంలో.. స్పిరిట్ లైన్ అండ్ ప్రభాస్‌ క్యారెక్టర్‌ మైండ్లోకి వచ్చిందని.. ప్రభాస్‌కు చెప్పగానే ఓకే అన్నాడని.. అలా ఈ సినిమా ఫాం అయిందని వంగా చెప్పాడు. అయితే సందీప్ చెప్పిన ఈ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న కొంత మంది నెటిజన్స్.. స్పిరిట్ హాలీవుడ్‌ రీమేక్ అంటూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. దీంతో చెవులు దొబ్బాయా అంటూ.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్ షురూ చేశారు.

Published on: Apr 09, 2024 04:00 PM