సంబరాల ఏటి గట్టు స్పెషల్ గ్లింప్స్‌.. సాయి తేజ్‌ బౌన్స్ బ్యాక్ అయినట్టేనా ??

Updated on: Oct 17, 2025 | 9:21 PM

బైక్ ప్రమాదం తర్వాత కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న సాయి దుర్గ తేజ్, సంబరాల ఏటి గట్టు సినిమాతో తిరిగి పుంజుకునేందుకు సిద్ధమయ్యారు. లేటెస్ట్ గ్లింప్స్ లో ఆయన సిక్స్ ప్యాక్ ఫిజిక్, మెరుగైన డైలాగ్ డెలివరీ అభిమానులలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇది సాయి తేజ్ కు గొప్ప పునరాగమన చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.

ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి దుర్గ తేజ్, బైక్ ప్రమాదం కారణంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విడుదలైన చిత్రాలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. గత చిత్రాలలో లుక్స్, డైలాగ్ డెలివరీ పరంగా విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ కష్టాలన్నింటినీ అధిగమించి, సాయి దుర్గ తేజ్ “సంబరాల ఏటి గట్టు” అనే పాన్ ఇండియా పిరియాడిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రపు ప్రత్యేక గ్లింప్స్‌లో, సాయి దుర్గ తేజ్ సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో కనిపించి ఆకట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’

ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??

శేషాచలంలో అరుదైన ప్రాణులు

అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా