Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కాస్ట్.. ఎన్ని కోట్లో తెలుసా ??
స్టార్ హీరోయిన్ సమంత భూతశుద్ధి వివాహంలో ధరించిన వెడ్డింగ్ రింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. రూ.1.5 కోట్ల విలువైన ఈ రింగ్ మొఘల్ కాలం నాటి 'పోట్రెయిట్ కట్' డిజైన్‌ను కలిగి ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్‌కు ఇష్టమైన ఈ డిజైన్‌కు గొప్ప చరిత్ర ఉందని, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నమని జ్యువెలరీ వ్యాపారి వెల్లడించారు.
స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌నిడుమోరు సోమవారం భూతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి ఫోటోలను స్వయంగా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో సమంత ధరించిన కాస్ట్యూమ్ తోపాటు ఆమె వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకతను తాజాగా ఓ జ్యువెలరీ వ్యాపారి బయటపెట్టారు. ఈ ఉంగరానికి చాలా పెద్ద చరిత్రే ఉందని వివరించారు. మొఘలుల కాలంలో తొలిసారి ఈ రకమైన డిజైన్ తో ఉంగరం తయారుచేశారని పేర్కొన్నారు. పోట్రెయిట్ కట్ గా పిలిచే ఈ డిజైన్ ను స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా భావిస్తారని తెలిపారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ కు ఈ డిజైన్ ఉంగరాలంటే చాలా ఇష్టమని చరిత్రకారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పోట్రెయిట్ కట్ రింగ్ తయారీ కోసం వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారుచేస్తారని జ్యువెలరీ వ్యాపారి చెప్పారు. ఈ రకమైన ఉంగరాలను అరుదుగా తయారుచేస్తారని పేర్కొన్నారు. సమంత వెడ్డింగ్ రింగ్ సుమారు రూ.1.5 కోట్లు విలువ చేస్తుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా.. అనిల్ రావిపూడి ధీమా
యాప్‌ల వినియోగంపై కేంద్రం కొత్త రూల్
Janhvi Kapoor: ‘నా తల్లి మరణంపై తప్పుడు ప్రచారం చేశారు’ జాన్వీకపూర్ ఎమోషనల్ !!
సూర్య కాంతాన్ని మించేస్తున్న తనూజ కాతం !! పాపం బిగ్ బాస్
షాజహాన్ – ముంతాజ్ మెచ్చిన రింగ్‌తో నిశ్చితార్థం !! సమంత ఆలోచన వెరీ స్పెషల్
