ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ ..ఆనందంలో సమంత వీడియో

Updated on: Jun 20, 2025 | 6:38 AM

హీరోయిన్‌ సమంత క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు, సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్‌ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా సమంత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కంటే తాను ఇప్పడే చాలా సంతోషంగా ఉన్నానని, ఇదే నిజమైన సంతోషం, విజయం అని భావిస్తున్నానని తెలిపారు.

గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం తాను మానసికంగా ఎంతో దృఢంగా, సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్న సమంత, ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, కీర్తి ప్రతిష్టలకు అతీతంగా, స్వేచ్ఛగా జీవితాన్ని గడపడమే నిజమైన విజయమని తాను భావిస్తున్నానన్నారు. గత రెండేళ్లుగా తాను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదని, అయితే ఈ విరామంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, వ్యక్తిగతంగా ఎంతో సాధించానని చెప్పుకొచ్చారు. జీవితంలో ఒకే వృత్తానికి పరిమితం కాకుండా స్వేచ్ఛగా ఎదగటం, పరిణితి సాధించడం అన్నింటికంటే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం :

జంట పాముల సయ్యాట..నెట్టింట వీడియో వైరల్

శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవి వీడియో

యజమాని వదిలేసి వచ్చినా.. 70 కి.మీ నడిచొచ్చిన శునకం వీడియో