Samantha: కొత్త యాడ్‌లో సమంతా రచ్చ.. మామూలుగా లేదు

|

Apr 29, 2023 | 9:31 AM

టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన సమంతా రూత్ ప్రభు ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన సమంతా రూత్ ప్రభు ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చారు. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ మూవీకి గుణశేఖర్ దర్శకుడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వర్షన్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు సమంతా. రాజ్, డీకే తెరకెక్కిస్తున్న ఈ సిరీస్ త్వరలో విడుదల కానుంది. ఇక అటు సినిమాలతో పాటు ఇటు పలు బ్రాండ్స్‌కి కూడా ప్రచారకర్తగా వ్యవహరిస్తూ మరింత క్రేజ్ తో దూసుకెళ్తున్నారు సమంతా. ప్రముఖ శీతలపానీయాల కంపెనీ పెప్సీ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంతాను నియమించుకుంది. ‘రైజ్‌ అప్, బేబీ’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమె నటించిన సరికొత్త పెప్సీ యాడ్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. సమంత ట్రెండీ స్టైల్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

15 ఏళ్ల బంధానికి ముగింపు.. మరో బాలీవుడ్ జంట విడాకులు !!

Ramabanam: వివాదంలో రామబాణం ఐఫోన్ పిల్ల సాంగ్..

Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్‌.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

Published on: Apr 29, 2023 09:31 AM