Samantha: సమంత – రాజ్‌ కన్ఫర్మ్ చేసినట్టేనా.. పూజలో కలిసి పాల్గొన్న జంట

Updated on: Oct 29, 2025 | 1:45 PM

సమంత మా ఇంటి బంగారం సినిమా ప్రారంభోత్సవ వీడియో విడుదలవ్వగా, సినిమాకు మించి వ్యక్తిగత అంశాలపైనే చర్చ నడుస్తోంది. నటి సమంత రాజ్ నిడిమోరుతో కలిసి పూజలో పాల్గొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది వారిద్దరి మధ్య సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు అధికారిక క్లారిటీనా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె తన కొత్త చిత్రం మా ఇంటి బంగారం షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వీడియో విడుదలైనప్పటికీ, సినిమాకు సంబంధించిన విషయాలకంటే సమంత వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. గతంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సమంత, వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలం వెండితెరకు విరామం ఇచ్చారు. ఈ విరామ సమయంలో వెబ్ సిరీస్‌లలో కనిపించినప్పటికీ, అభిమానులు ఆమెను వెండితెరపై మిస్ అయ్యారు. గత ఏడాది సమంత పుట్టినరోజు సందర్భంగా, ఆమె తన సొంత బ్యానర్‌పై మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. సుమారు ఒక సంవత్సరం తర్వాత, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హద్దులు చెరిపేస్తున్న క్రేజీ కెప్టెన్స్‌.. వాళ్ళ అడుగులు పాన్ ఇండియా వైపే

డిసెంబర్‌లో సినిమా జాతర.. అంచనాలు పెంచుతున్న మూవీస్

బాహుబలి ది ఎపిక్‌ ప్రమోషన్స్‌లో ట్విస్ట్‌.. నెక్స్ట్ లెవల్‌ స్కెచ్ వేసిన జక్కన్న

Shruti Haasan: నార్త్, సౌత్‌కున్న తేడాని గమనించిన శృతిహాసన్

Weather Update: నవంబరు 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం