ఆయుష్షు ఉన్నంత వరకే.. బిష్ణోయ్‌ హత్య బెదిరింపులపై సల్మాన్‌ వీడియో

|

Apr 02, 2025 | 4:34 PM

తనకు వస్తున్న హత్య బెదిరింపుల గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించారు. తను నటించిన కొత్త సినిమా సికిందర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ నుంచి చంపేస్తామని సల్మాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి. ఆయన ఇంటి ముందు వారు కాల్పులు కూడా జరిపారు. ఏదో ఓ రోజు ఆయనపై తప్పకుండా పగ తీర్చుకుంటామని వారు గట్టిగానే హెచ్చరించారు.

తాజాగా ఈ బెదిరింపులపై సల్మాన్‌ స్పందించారు.సినిమా షూటింగ్స్‌ వల్ల ఎప్పుడూ కూడా సల్మాన్‌ చాలా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం కూడా గట్టిగానే భద్రత కల్పించింది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరికలపై స్పందిస్తూ తాను ఎక్కువగా దేవుడిని నమ్ముతాననీ తన జీవితం ఆయన చేతుల్లోనే ఉందనీ వేదాంతం మాట్లాడారు. ఆయుష్షు ఎంత వరకు ఆ దేవుడు ఇచ్చాడో అంత వరకు మాత్రమే జీవిస్తాననీ ఇదంతా దేవుడి ఇష్టం అన్నారు. గట్టి భద్రత కల్పించారు కానీ ఒక్కోసారి అది కూడా పెను సవాలుగా అనిపిస్తుందనీ ఏదేమైనా ఆందోళనగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు అని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు.. వీడియోలు వైరల్‌

కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో

రామ్‌ చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌ వచ్చేసింది.. RC 16 టైటిల్‌ ఇదే!

మా అణ్వాయుధాలు ఇవిగో.. ట్రంప్‌ను రెచ్చగొడుతూ ఇరాన్‌ వీడియో