Yash in Salaar: నమ్మకండి.. దాంతో సంబంధం లేదు.! సలార్ ప్రోడ్యూసర్ క్లారిటీ.

|

Dec 17, 2023 | 1:21 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా సలార్. ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ 1,2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ మాస్ యాక్షన్ రోల్ పోషిస్తుండడంతో మరింత హైప్ నెలకొంది. పోస్టర్స్, గ్లింప్స్ తో ఆసక్తిని పెంచేసిన మేకర్స్..ఇప్పుడు ట్రైలర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ సినిమా సలార్. ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ 1,2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ మాస్ యాక్షన్ రోల్ పోషిస్తుండడంతో మరింత హైప్ నెలకొంది. పోస్టర్స్, గ్లింప్స్ తో ఆసక్తిని పెంచేసిన మేకర్స్..ఇప్పుడు ట్రైలర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పేశారు. అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 22న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పుడు విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షూరు చేశారు మేకర్స్. అయితే ముందు నుంచి సలార్ సినిమాపై రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

గతంలో నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రానికి.. సలార్ మూవీకి లింక్ ఉందంటూ రూమర్స్ వైరలయ్యాయి. అంతేకాదు. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు.. కేజీఎఫ్ స్టార్ యష్ సైతం కనిపిస్తారని టాక్ నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు ప్రోడ్యూసర్ కిరగందూర్. ‘‘కేజీఎఫ్‌కి, సలార్‌కి మధ్య ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు ప్రశాంత్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. సినిమాలో క్యామియో లేదు. కాబట్టి అది నిజం కాదు” అని నిర్మాత విజయ్ కిరగందూర్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సలార్ సినిమాకు.. కేజీఎఫ్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.