Prithviraj Sukumaran: రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!

|

Sep 20, 2024 | 11:11 AM

మలయాళీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరో.. పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో.. తాజాగా ముంబయ్‌లో ఓ లగ్జరీ అండ్ లావిష్ విల్లాను కొన్నారనే న్యూస్ బయటికి వచ్చింది. ఆ విల్లా ధర అక్షరాలా 30 కోట్లు అనే విషయం కాస్తా ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్..

మలయాళీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరో.. పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ హీరో.. తాజాగా ముంబయ్‌లో ఓ లగ్జరీ అండ్ లావిష్ విల్లాను కొన్నారనే న్యూస్ బయటికి వచ్చింది. ఆ విల్లా ధర అక్షరాలా 30 కోట్లు అనే విషయం కాస్తా ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలో ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారట. ముంబైలో అతడికి ఇది రెండో ఇల్లు. కానీ ఇప్పుడు కొన్న విలాసవంతమైన ఇంటి ధర ఏకంగా 30 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం.

అంతేకాదు ఆ ఇల్లు పాలి హిల్ లో ఉందట. ఆ ఏరియాను బాలీవుడ్ ఎ-లిస్టర్‌ల హట్‌గా పిలుస్తారు. చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ఇక్కడ నివసిస్తున్నారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, తేగర్ ష్రాఫ్, క్రికెటర్ కె. ఎల్. రాహుల్ తదితరులందరికీ ఇక్కడ నివాసాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ అతడి భార్య సుప్రియకు చెందిన నిర్మాణ సంస్థ అయిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఈ ఇంటిని కొనుగోలు చేశారు. బాంద్రా వెస్ట్‌లోని ప్రీమియం హౌసింగ్ సొసైటీ అయిన నరైన్ టెర్రస్‌లో 2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఇల్లు ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.