RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన RRR
జక్కన్న ట్రిపుల్ ఆర్ రికార్డులు తిరగరాయడం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇంటర్నేషనల్‌గా పర్ఫార్మ్ చేయడం ఆపకుండా ఉంది. ఇప్పటికే పాన్ ఇండియాలో నెంబర్ 1 ఫిల్మ్ గా రికార్డులు తిరగరాసిన ఈ సినిమా..
జక్కన్న ట్రిపుల్ ఆర్ రికార్డులు తిరగరాయడం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇంటర్నేషనల్‌గా పర్ఫార్మ్ చేయడం ఆపకుండా ఉంది. ఇప్పటికే పాన్ ఇండియాలో నెంబర్ 1 ఫిల్మ్ గా రికార్డులు తిరగరాసిన ఈ సినిమా.. హాలీవుడ్ స్థాయిలో కూడా సూపర్ డూపర్ హిట్టనే టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ సినిమాలను మించేలా ఉందనే అప్లాజ్ రాబట్టింది. ఇక అదే జోష్‌తో.. తాజాగా గోల్డెడ్ గ్లోబ్ అవార్డుల్లో ఇండియా నుంచి నామినేట్ అయింది. ఆస్కార్ తరువాత అంతే ప్రాముఖ్యమైన ఈ అవార్డుల్లో … ఏకంగా రెండు విభాగాల్లో..నామినేట్ అయింది. భారతీయులను ప్రౌడ్ గా ఫీలయ్యేలా చేస్తోంది. ఎస్ ! ఇప్పటికే హాలీవుడ్ లో ఎన్నో అవార్డులు సాధించి ఆస్కార్ రేసులో ముందుకెళుతున్న ట్రిపుల్ ఆర్ సినిమా.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ముంగిట ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ అనుకునే సినిమాల కిచ్చే గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. 80 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్ ఇన్ నాన్ ఇంగ్లీష్ కాటగిరీలో … ఇండియా నుంచి ఒక్క ట్రిపుల్ ఆర్ మాత్రమే నామినేట్ అయింది. బెస్ట్ పిక్చర్ తో పాటు.. బెస్ట్ వర్జినల్ సాంగ్ కాటగిరీలో.. కీరవాణి నాటు నాటు సాంగ్ కూడా నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. అవార్డు రావడం ఖాయంగా కూడా కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Avatar 2 Review: అవతార్ 2 రివ్యూ.. ‘పరమ బోరింగ్ సినిమా’
TOP 9 ET News: రవితేజ మాటలపై తెలంగాణలో గుస్సా |గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన RRR