నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. అంతకు మించి అనేలా ఉండబోతుందా ??
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఉన్న సందిగ్ధతకు తెరదించారు. కాంతార చాప్టర్ 1 తర్వాత జై హనుమాన్ సినిమాతో ముందుకు రానున్నారు. జనవరిలో షూటింగ్ ప్రారంభమై ఐదు నెలలు జరుగుతుంది. దీని తర్వాత సందీప్ సింగ్ రూపొందించే ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రాజెక్ట్ మొదలవుతుంది.
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార సినిమా విజయం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కాంతార చాప్టర్ 1 విడుదలైన తర్వాత ఆయన తదుపరి సినిమా ఏది అన్న విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. అయితే, రిషబ్ శెట్టి తాజాగా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. కాంతార చాప్టర్ 1 ప్రమోషన్స్ సందర్భంగా తన తదుపరి ప్రాజెక్ట్ జై హనుమాన్ అని ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఇందుకోసం రిషబ్ ఐదు నెలల పాటు డేట్స్ కేటాయించారు. జై హనుమాన్ పూర్తయిన వెంటనే, బాలీవుడ్ మేకర్ సందీప్ సింగ్ రూపొందిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను పట్టాలెక్కిస్తారు. దీంతో ఆయన తదుపరి సినిమాల విషయంలో ఉన్న గందరగోళం తొలగిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ నుంచి ఆఫ్రికా వరకు విస్తరించిన ఐబొమ్మ రవి నెట్ వర్క్
Raju Weds Rambai: క్లైమాక్స్ కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చినట్టే
TOP 9 ET News: ట్రోల్స్ కాదు..దిమ్మతిరిగేలా వ్యూస్ !! పెద్ది సూపర్ రికార్డ్
ప్రేమ మనిషిని చేస్తే.. బ్రేకప్ ‘పైరసీ కింగ్’గా మలిచింది
రూ 7.4 లక్షల నుంచి రూ 60 లక్షల ప్యాకేజ్‌కి .. టెకీ పోస్ట్ వైరల్