Rashmika Mandanna: స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యిన కన్నడ కన్నడ అమ్మాయి రష్మిక.. వరుస ఆఫర్లతో తక్కువ సమయంలోనే టాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు.
ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యిన కన్నడ కన్నడ అమ్మాయి రష్మిక.. వరుస ఆఫర్లతో తక్కువ సమయంలోనే టాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక.. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలలో వరుస ప్రాజెక్టులతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక తన అభిమాన హీరో గురించి చెప్పుకొచ్చారు. తన స్కూల్ డేస్ నుంచి దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమట. భారీ స్టార్డమ్ ఉన్నప్పటికీ విజయ్ గారు చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనలోని సింప్లిసిటీ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది అంటూ తాజాగా ఓ ఇంట్రవ్యూలో చెప్పుకొచ్చారు రష్మిక. కాగా రష్మిక ఇప్పుడు దళపతి విజయ్ తో కలిసి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: