Rashmika Mandanna: ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్

Updated on: Jan 24, 2025 | 1:51 PM

సినిమాతో భారీ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా రూ. 18 వందలకోట్లకు పైగా వసూల్ చేసి సత్తా చాటుతోంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ రాణిస్తోంది. తాజాగా రష్మిక రిటైర్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఇది విని చాలా మంది షాక్ అవుతున్నారు. ఇటీవల రష్మిక కాలికి గాయమైన విషయం తెలిసిందే.. రష్మిక మందన్న హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. హిందీ నిర్మాతలు రష్మిక కాల్షీట్ కోసం రేసులో ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ విక్కీ కౌశల్‌తో ‘చావా’ సినిమా చేసింది. ఈ మూవీలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ పోషించాడు. శంభాజీ భార్య మహారాణి యేసుబాయి పాత్రలో నటి రష్మిక కనిపించనుంది. ఈ సినిమా గురించి రష్మిక .. సౌత్ నుంచి వచ్చి మహారాణి యేసుబాయి పాత్రలో నటించాను. ఇది నా జీవితంలో నేను చేసిన ప్రత్యేక పాత్ర. ఈ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనిపించిందని దర్శకుడు లక్ష్మణ్‌తో చెప్పాను’ అని రష్మిక తెలిపింది. చావా ట్రైలర్ నన్ను ఆకట్టుకుంది. విక్కీ కౌశల్ దేవుడిలా కనిపిస్తున్నాడు అని తెలిపింది రష్మిక. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో రష్మిక మందన్న ఈ ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన్నకు డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ఏంటీ.. చరణ్‌ సినిమాలో మోనాలిసానా? | రూ.200 కోట్లు దాటిన వెంకీ సినిమా కలెక్షన్స్

డబ్బిచ్చి మరీ జైలుకెళుతున్నారు! ఏమిటీ విచిత్రం?

పాఠశాలలో మహిళా టీచర్ తో హెడ్మాస్టర్‌ రాసలీలలు.. వీడియో వైరల్‌

అచ్ఛం మనిషిలాగే గాలిపటాన్ని ఎగరేసిన కోతి

మీ ఇంటి మెయిన్‌ డోర్‌కి నేమ్‌ ప్లేట్‌ పెట్టారా? తేడా వస్తే ఎంత డేంజరంటే