Samantha: సమంతను ఫాలో అవుతున్న రష్మిక… ఇంతకీ సంగతేంటంటే.!
ప్రస్తుతం హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకేరకమైన పాత్రలు కాకుండా విభిన్న పాత్రలు పోషించాలనే ధోరణి బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి...
ప్రస్తుతం హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకేరకమైన పాత్రలు కాకుండా విభిన్న పాత్రలు పోషించాలనే ధోరణి బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్‌లో హీరోయిన్లు నటించాలంటే పెద్దగా ఆసక్తి చూపే వారు కాదు. కానీ గత కొన్ని రోజులుగా టాప్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా సమంత పుష్పలో ‘ఊ అంటావా’ అంటూ ఎలాంటి హంగామా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఒక్క పాటతో బాలీవుడ్‌లో దుమ్మురేపింది సామ్.