Rasha Thadani: బాలీవుడ్ నయా సెన్సేషన్ రాషా తడాని
స్టార్ కిడ్స్ అరుదుగా పొందే తక్షణ గుర్తింపును రవీనా టాండన్ కూతురు రాషా తడాని సొంతం చేసుకున్నారు. తొలి బాలీవుడ్ చిత్రంలోనే తన డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రేజ్‌తోనే ఇప్పుడు టాలీవుడ్‌లో ఘట్టమనేని వారసుడు జై కృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆమె దక్షిణాదిలోనూ తన మ్యాజిక్‌ను కొనసాగిస్తుందో లేదో చూడాలి.
హీరోయిన్లుగా పరిచయమైన స్టార్ కిడ్స్‌కు తక్షణ క్రేజ్ రావడం చాలా అరుదు. శ్రీదేవి కూతురిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్‌కు కూడా అంత బజ్ రాలేదు. అయితే, ఈ నియమాన్ని బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ వారసురాలు రాషా తడాని మార్చేశారు. తొలి బాలీవుడ్ సినిమాతోనే హాట్ టాపిక్‌గా మారి, ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు. 90లలో సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన రవీనా టాండన్ కూతురిగా రాషా తడాని ఆజాద్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోయినా, రాషా మాత్రం టాక్ ఆఫ్ ది బీ టౌన్గా మారారు. ముఖ్యంగా ఉయ్యమ్మా పాటలో ఆమె డ్యాన్స్ స్టెప్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. అంతకు మించి అనేలా ఉండబోతుందా ??
ఏపీ నుంచి ఆఫ్రికా వరకు విస్తరించిన ఐబొమ్మ రవి నెట్ వర్క్
Raju Weds Rambai: క్లైమాక్స్ కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చినట్టే
TOP 9 ET News: ట్రోల్స్ కాదు..దిమ్మతిరిగేలా వ్యూస్ !! పెద్ది సూపర్ రికార్డ్