Animal: యానిమల్‌ దాటికి షేక్ అవుతున్న నెట్‌ఫ్లిక్స్‌.! ఓటీటీలో దూసుకుపోతున్న యానిమల్.

Updated on: Jan 27, 2024 | 11:56 AM

ఎట్టకేలకు పాన్ ఇండియా సినీ ప్రియుల ఎదురుచూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చీ రావడమే ఓటీటీ ఫీల్డ్‌లో షేక్ క్రియేట్ చేసింది. దిమ్మతిరిగే రెస్పాన్స్‌ రాబట్టుకుంటోంది. అందర్నీ నెట్‌ఫ్లిక్స్‌ వంకే చూసేలా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్.

ఎట్టకేలకు పాన్ ఇండియా సినీ ప్రియుల ఎదురుచూపులకు తెర పడింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘యానిమల్’ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చీ రావడమే ఓటీటీ ఫీల్డ్‌లో షేక్ క్రియేట్ చేసింది. దిమ్మతిరిగే రెస్పాన్స్‌ రాబట్టుకుంటోంది. అందర్నీ నెట్‌ఫ్లిక్స్‌ వంకే చూసేలా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. దాదాపు 900కు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంతో థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ వెయిటింగ్‌కు ఎండ్‌ కార్డ్‌ వేస్తూ… ఎట్టకేలకు జనవరి 26న అర్దరాత్రి నుంచి యానిమల్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవడమే కాదు.. అనుకున్నట్టే దిమ్మతిరిగే రెస్పాన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos