Jai Hanuman Movie: జై హనుమాన్‌ లో రానా దగ్గుబాటి..?

Edited By:

Updated on: Jul 31, 2026 | 4:52 PM

‘హనుమాన్’ ఘన విజయానంతరం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తుండగా, అశ్వత్థామ పాత్ర కోసం రానా దగ్గుబాటిని ఎంపిక చేసినట్లు సమాచారం. తేజ సజ్జ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టించిన హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి. ఈ గ్లోబల్ రేంజ్ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోను రంగంలోకి దించుతున్నారు మేకర్స్. మల్టీస్టారర్ ఫార్ములాతో బాక్సాఫీస్ సక్సెస్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇంతకీ ఏంటా విశేషాలు అనుకుంటున్నారా.. అయితే వాచ్‌ దిస్ స్టోరి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. చిన్న సినిమాగా వచ్చి గ్లోబల్ లెవెల్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ను పట్టాలెక్కించారు ప్రశాంత్ వర్మ. తొలి భాగం సక్సెస్ నుంచి వచ్చిన హైప్‌, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు.జై హనుమాన్ మూవీలో హనుమాన్ పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే రివీల్ అయిన రిషబ్‌ లుక్‌కు పాన్ ఇండియా రేంజ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు తొలి భాగంలో నటించిన తేజ సజ్జ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గ్లోబల్‌ టార్గెట్‌తో రూపొందుతున్న జై హనుమాన్‌కు మరింత స్టార్ పవర్ యాడ్ చేస్తున్నారు మేకర్స్. సినిమాలో కీలకమైన అశ్వథ్థామ పాత్రకు రానా దగ్గుబాటిని సెలెక్ట్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రానా లాంటి స్టార్ హీరో ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు పీక్స్‌కు చేరాయి. ప్రజెంట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా నుంచి మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలో వెల్లడించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్

కర్నూలులో ఘరానా మోసం… తల్లికి వందనం సొమ్ము స్వాహా!

ఆగస్ట్ 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం.. ఏ దేశాల్లో చూడొచ్చంటే!

Vande Bharat Cargo: గంటకు 145 కి.మీ వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్ కార్గో’

హిందూ మహాసముద్రంలో తేలుతున్న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌షిప్‌

Loading...
Unable to load recommendations.
Follow Us