ఇది ఎవరి తాత నాన్నల కథ కాదు వీడియో

Updated on: Nov 16, 2025 | 1:10 PM

దుల్కర్ సల్మాన్ హీరోగా రానా దగ్గుబాటి నిర్మాణంలో తెరకెక్కుతున్న కాంత చిత్రం వివాదాస్పదమైంది. ఓ పాత హీరో రిఫరెన్స్ వివాదంపై రానా స్పందిస్తూ, ఇది ఎవరి తాత నాన్నల కథ కాదని, పూర్తి ఫిక్షనల్ కథ అని స్పష్టం చేశారు. 1950ల నేపథ్యంతో, ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య ఈగో వార్ నేపథ్యంలో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుందని రానా పేర్కొన్నారు.

దుల్కర్ సల్మాన్ హీరోగా, రానా దగ్గుబాటి నిర్మాతగా తెరకెక్కిన కాంత చిత్రం విడుదల కాకముందే వివాదాలకు కేంద్రంగా మారింది. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి, దుల్కర్ పాత్ర ఓ పాత హీరోను పోలి ఉందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి. ఇది ఆ స్టార్ హీరో అభిమానులను కలవరపెట్టింది. ఈ విషయంపై నిర్మాత కమ్ నటుడు రానా దగ్గుబాటి స్పష్టతనిచ్చారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రానా మాట్లాడుతూ, “ఈ సినిమా ఎవరి తాత నాన్నల కథ కాదు” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కాంత ఒక పూర్తి ఫిక్షనల్ కథ అని ఆయన స్పష్టం చేశారు. 1950ల నేపథ్యంతో, గురు శిష్యులుగా పేరు తెచ్చుకున్న ఓ దర్శకుడు, హీరో మధ్య జరిగే ఈగో యుద్ధం ఈ సినిమా ఇతివృత్తం. ఆ కాలంలో సాహిత్యం, సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేదని, ఎటువంటి రాజీలకు అవకాశం ఉండేది కాదని రానా వివరించారు.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో