ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో

Updated on: May 12, 2025 | 7:28 AM

పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రమూక ఒక్కసారిగా పర్యాటకులపై కాల్పులకు దిగబడింది. అది ఒక్కొక్కరిని మతం అడిగిమరి అత్యంత పాశవికంగా కాల్చి చంపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టూరిస్టుల జంటలుగా ఉన్నవారి వద్దకు వెళ్లి భర్తలను మాత్రమే చంపి టూరిస్టు మహిళలను మాత్రం టెర్రరిస్టులు వదిలేశారు. ఆవేదనతో తనను కూడా చంపమని ఓ మహిళ కోరగా నిన్ను చంపం. ఓట్లేసి గెలిపించుకున్నారుగా వెళ్లి మోడీకి చెప్పు అంటూ కిరాతకంగా రక్తపాతం పారించారు. ఈ ఘటనతో యావత్ భారతం బగుమంది.

మరోవైపు చనిపోయిన భర్త పక్కన దీనంగా కూర్చుని ఏడుస్తున్న మహిళ ఫోటో ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సర్వత్రా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు మౌలిక సదుపాయాలు కేంద్రంగా భీకర దాడులు నిర్వహించింది. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం రెండు దేశాల నడుమ ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై భారతీయులంతా హర్షం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ గురువారం రాత్రి క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను మనదేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ లపై వాటిని వదిలింది.

మరిన్ని వీడియోల కోసం :

కొత్త చీపురు కొంటున్నారా జాగ్రత్త వీడియో

పైనాపిల్ జ్యూస్ తాగడం వలన బోలెడు లాభాలు వీడియో

ఆ రోజు హెయిర్ కట్ చేయించుకుంటే మీ పని అవుట్!వీడియో

మీలో లవ్ హార్మోన్ పెరగాలా.. ఇలా చేయండి వీడియో