Ramayana: ‘రామాయణ’ ట్రైలర్‌కు గ్లోబల్ గ్రాండ్ ఎంట్రీ… కామిక్-కాన్ వేదికగా చరిత్ర సృష్టించనున్న మేకర్స్
నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా ట్రైలర్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్, డిజిటల్ కోసం రెండు వేర్వేరు ట్రైలర్ వెర్షన్లు సిద్ధం చేసినట్లు సమాచారం. శాన్ డియాగో కామిక్-కాన్ 2026 వేదికగా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్న మేకర్స్, రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గ్లోబల్ ఈవెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు.
బడ్జెట్ దగ్గర నుంచి కాస్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ రామాయణ ఒక సెన్సేషనే. దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్‌కు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ప్లానింగ్ గ్లోబల్ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. జూలై 24న వరల్డ్ వైడ్‌గా రామాయణ ట్రైలర్ లాంచ్. ఈ ట్రైలర్ సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఓ ట్రైలర్‌కు సంబంధించి రెండు వర్షన్స్‌ను మేకర్స్ సెన్సార్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు వర్షన్స్‌కు యు సర్టిఫికేటే వచ్చింది. ఒకటి 4 నిమిషాల 15 సెకన్ల రన్‌టైమ్‌తో, మరొకటి కరెక్ట్‌గా 4 నిమిషాలు రన్ టైమ్‌తో కట్ చేసిన ట్రైలర్స్‌ను రిలీజ్‌కు సిద్ధం చేశారు మేకర్స్. థియేటర్ వర్షన్ కోసం 4 మినిట్స్, డిజిటల్‌లో రిలీజ్ చేసే ట్రైలర్‌ను 4 మినిట్స్ 15 సెకండ్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ చేస్తున్నారు. అయితే డిజిటల్ వర్షన్ వర్షన్ అదనంగా ఉండే ఆ పదిహేను సెకన్ల కంటెంట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తోంది రామాయణ టీమ్. శాన్ డియాగోలో జరిగే ప్రతిష్టాత్మక ‘కామిక్-కాన్ 2026’ ఈవెంట్‌లో రామాయణం ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. సుమారు 5 వేల మంది కెపాసిటీ ఉన్న బాల్‌రూమ్ 20లో ఈ ఈవెంట్ జరగనుంది. రణబీర్ కపూర్, యశ్, డైరెక్టర్ నితీశ్ తివారీ, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఈ గ్లోబల్ లాంచ్‌లో పాల్గొనబోతున్నారు. దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది రికార్డ్ బడ్జెట్. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీత నటిస్తున్న ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ యశ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని 2026 దీపావళికి తొలి భాగాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘వారణాసి’ తర్వాత జక్కన్న ప్లాన్ ఏంటి?… నెక్ట్స్ హీరోపై మొదలైన భారీ చర్చ..!
Jana Nayagan: ఆర్నెల్ల నిరీక్షణకు ముగింపు… ‘జన నాయగన్’ రాకతో బాక్సాఫీస్‌లో కొత్త సమరం..!
Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!
Paradise: ‘ది ప్యారడైజ్’పై రూ.110 కోట్ల రూమర్స్… మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!
Akhil Akkineni: ‘లెనిన్’తో మారిన అఖిల్… ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
