Ramajogya Sastry: ఫ్యాన్స్ దెబ్బకు కనిపించకుండా పోయిన రామజోగయ్య శాస్త్రి అకౌంట్.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరుకారం. త్రివిక్రమ్ డైరెక్షన్లో బాబు చేస్తున్న మూడో సినిమా కావడంతో... ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికితోడు ఈ మూవీ నుంచి బయటికి వస్తున్న సాంగ్స్ మరో లెవల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే వారి అంచనాలకు తగ్గట్టు తాజాగా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ లేకపోవడంతో... మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ఆయన వర్క్ పై తీవ్ర కామెంట్స్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరుకారం. త్రివిక్రమ్ డైరెక్షన్లో బాబు చేస్తున్న మూడో సినిమా కావడంతో… ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికితోడు ఈ మూవీ నుంచి బయటికి వస్తున్న సాంగ్స్ మరో లెవల్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే వారి అంచనాలకు తగ్గట్టు తాజాగా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ లేకపోవడంతో.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ఆయన వర్క్ పై తీవ్ర కామెంట్స్ చేశారు. అయితే ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టిన ఈ సాంగ్ లిరిసిస్ట్.. ఉన్నట్టుండి ఎక్స్ నుంచి మామైపోయారు. దీంతో ఇది కూడా నెట్టింట ఓ వైరల్ టాపిక్ గా మారింది. గుంటూరు కారం నుంచి రీసెంట్ గా సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అంతే కాదు ఈసాంగ్ కేవలం 2 నిముషాలు మాత్రమే ఉండటంతో అభిమానులు నిరాశపడ్డారు.
సోషల్ మీడియాలో సాంగ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దాంతో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఎక్స్‌లో కొంతమందికి కౌటర్ ఇచ్చారు. సాంగ్ కు ఏం తక్కువైంది.. టైం తప్ప .. ప్రతివాడు మాట్లాడేవాడే అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కామెంట్స్‌తో… ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు. మహేష్ బాబు సినిమా కు ఇలాంటి సాంగ్ ఏంటి.? నిరాశపరిచారు.. మీ నుంచి ఇలాంటిది ఎక్స్ పెట్ చేయలేదంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ ఎఫెక్టో ఏమో తెలీదు కానీ… రామ జోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశారు. ఆయన ట్విట్టర్ ఎక్స్ నుంచి కనిపించకుండా పోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.