Double Ismart Review: హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?

Double Ismart Review: హిట్టా.? ఫట్టా.? పూరీ కం బ్యాక్ ఇచ్చారా.? రామ్ మెప్పించాడా.?

Anil kumar poka

|

Updated on: Aug 16, 2024 | 11:59 AM

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌తో వీరిద్దరూ థియేటర్లలోకి వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్‌ గా అందర్నీ మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం? ఇస్మార్ట్ శంకర్ తనలో చిప్ పెట్టుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో లండన్ లో ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిగ్ బుల్ అలియాస్ సంజయ్ దత్ కు మెదడుకు సంబంధించిన సమస్య ఒకటి వస్తుంది.

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఇస్మార్ట్ శంకర్. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా సీక్వెల్‌తో వీరిద్దరూ థియేటర్లలోకి వచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్‌ గా అందర్నీ మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం?

ఇస్మార్ట్ శంకర్ తనలో చిప్ పెట్టుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో లండన్ లో ఇండియన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బిగ్ బుల్ అలియాస్ సంజయ్ దత్ కు మెదడుకు సంబంధించిన సమస్య ఒకటి వస్తుంది. హాయి గా బతకాలంటే అతని మెమొరీని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలని డాక్టర్స్ చెప్తారు. దాంతో ఇండియాకు వచ్చి ఇస్మార్ట్ శంకర్ కోసం వెతుకుతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. అతడి జీవితంలోకి జన్నత్ అలియాస్ కావ్య ఎలా వచ్చింది అనేది పూర్తి కథ..

బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు.. సీక్వెల్ కూడా.. అయినా కథ బాగుంటే సీక్వెల్ వర్కవుట్ అవుతుంది కానీ బ్రాండ్ నేమ్ తో కాదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు పూరి జగన్నాథ్. ఐదేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకు మొదట యావరేజ్ టాక్ వచ్చినా.. కూడా పరిస్థితులు అన్నీ కలిసి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. రామ్ ఎనర్జీ, పాటలు వర్క్ అవుట్ అవ్వడంతో సినిమా రేంజ్ మారిపోయింది. మళ్లీ అదే కథను సేమ్ టెంప్లేట్ లో వేసుకుని డబుల్ ఇస్మార్ట్ తీశాడు పూరి. సంబంధం లేని సన్నివేశాలు, కామెడీ కోసం రాసిన ట్రాక్ లు.. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్.. ఇవన్నీ చూస్తుంటే.. పూరీలోని రైటర్ ఇంత దిగజారిపోయాడా అని బాధనిపించింది.

అలీ ట్రాక్ అయితే మరీ దారుణం.. కథకు సంబంధమే లేని కామెడీ కానీ కామెడీ ఇది. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు.. రెండూ రెండే.. దొందు దొందే.. చాలా వరకు సీన్స్ ల్యాగ్ అనిపించాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కొన్ని సీన్స్ రాసుకున్నాడు కానీ అవి అంతగా వర్కౌట్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ లో కనీసం కొన్ని కామెడీ సీన్స్ తో పాటు, పాటలు బాగుంటాయి. ఇందులో అలా గుర్తు పెట్టుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు. ఏదో ఒక సినిమా చేయాలి అన్నట్టు చేసాడే కానీ.. కాన్సట్రేట్ చేసి తీసినట్టు ఎక్కడా అనిపించలేదు. పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా ఊహించడం కాస్త కష్టమే. కానీ ఎందుకో సంబంధం లేని సన్నివేశాలు చాలా రాసుకున్నట్టు అనిపించింది.

\రామ్ మరోసారి ఎనర్జీ చూపించాడు. క్యారెక్టర్ కోసం కష్టపడ్డాడు. పాటల్లో డాన్సులు అదిరిపోయాయి. యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. సంజయ్ దత్ జస్ట్ ఓకే.. కావ్య తపర్ పూర్తిగా గ్లామర్ కే పరిమితమైంది. గెటప్ శ్రీను ఉన్నంతవరకు బాగానే చేశాడు. మిగిలిన వాళ్లంతా ఓకే. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ప్రధానమైన పాజిటివ్ పాయింట్ మణిశర్మ మ్యూజిక్. సీక్వెల్ లో ఆరెంజ్ మ్యాజిక్ కనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. ఎడిటింగ్ చాలావరకు స్లోగా ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్.. నాటెటాల్ స్మార్ట్!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.