పవన్‌, నాగబాబు.. ఇంట్లో ఏం చేసేవారో బయటపెట్టిన చరణ్‌

|

Jan 12, 2025 | 12:31 PM

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో లేటెస్ట్ ఎపిసోడ్ కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. తన గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ టాక్ షోకు వచ్చిన చరణ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకున్న అనుబంధంపై ఓపెన్ అయ్యాడు.

ఈ క్రమంలోనే ఈ ముగ్గురిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు చరణ్‌. నాన్న సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో తాను చిన్నప్పుడు పవన్ కల్యాణ్ బాబాయ్ తోనే అన్నీ షేర్ చేసుకునేవాడినని చెప్పిన చరణ్‌.. నాన్న కూడా తన బాధ్యతలను కల్యాణ్ బాబాయికే అప్పచెప్పేశారన్నారు. ట్యూషన్స్ నుంచి హార్స్ రైడింగ్ వరకు అన్నీ బాబాయే తీసుకెళ్లేవారని.. ఇంటికి వచ్చాక మాత్రం ఫుడ్, స్టడీస్, హోమ్ వర్క్ ఇతర బాధ్యతలను నాగ్ బాబాయి చూసుకునే వారని చెర్రీ చెప్పాడు. ఏదేమైనా తన చిన్నప్పుడు ఎక్కువ సమయం కళ్యాణ్ బాబాయ్ తోనే గడిపానంటూ చెప్పాడు చరణ్‌.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య ఫోన్‏లో స్పై కెమెరా యాప్ ఇన్‌స్టాల్ చేస్తే ?? OTTలో నయా థ్రిల్లర్ మూవీ

Game Changer: రామ్ చరణ్‌ యాక్టింగ్‌కు.. శంకర్ దిమ్మతిరిగే రియాక్షన్

చరణ్ గేమ్‌ ఛేంజర్‌కు రేవంత్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

TOP 9 ET News: బన్నీ ఎఫెక్ట్ !! అసలు విషయం దాస్తున్న చరణ్‌

గుడిలో పెళ్లి తంతు జరిపిస్తున్న పురోహితుడు.. వాష్‌రూమ్‌కి వెళ్లిన వధువు.. చివరికి