Ram Charan: ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో రామ్‌చరణ్.. గతంలో జూ. ఎన్టీఆర్‌కు దక్కిన గౌరవం.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నారు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ . ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సాధించి భారతీయ సినిమా కీర్తిని ప్రపంచానికి చాటింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నారు అగ్ర హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ . ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును సాధించి భారతీయ సినిమా కీర్తిని ప్రపంచానికి చాటింది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్‌కు కూడా ఆ అవకాశం దక్కింది. అకాడమీ నుంచి లేటెస్ట్ గా విడుదలైన యాక్టర్స్ బ్రాంచ్ కొత్త లిస్టులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును అనౌన్స్ చేసింది. చరణ్‌తోపాటు మరో 7 గురు నటులు కూడా యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరారు. చరణ్ ఈ జాబితాలో చేరడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మేరకు చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. ఆర్‌సీ15గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. రాంచరణ్ దీంతోపాటు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్‌సీ 16కు కూడా గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.