Ram Charan : అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన వైజాగ్ బీచ్‌

| Edited By: TV9 Telugu

Mar 19, 2024 | 2:20 PM

గేమ్ ఛేంజర్ నయా షెడ్యూల్లో భాగంగా... వైజాగ్‌ వచ్చిన చెర్రీ అండ్ టీం.. అక్కడ వైజాగ్‌ బీచ్‌లో వేసిన బహిరంగ సభ సెట్టులో షూటింగ్‌కు వచ్చారు. అయితే ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్‌ అండ్ రామ్ చరణ్‌ బలగం.. కుప్పలు తెప్పలుగా ఆర్కే బీచ్‌కు వచ్చారు. బీచ్‌నే అల్లకల్లోలం చేసేశారు.

కుప్పలు తెప్పలుగా.. గుంపులు గుంపులుగా జనం ఉంటే.. ఇసుక వేస్తే కింద రాలనంత జనం ఉన్నారని.. చెబుతుంటాం..! కానీ దీనికి బదులు.. ఇప్పటి నుంచి బీచ్‌లో ఉన్న ఇసుక కనిపించనంత! అని చెబుతాం ఏమో! ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను చూసేందుకు వైజాగ్ ఆర్కే బీచ్‌కు ఆ రేంజ్లో జనం వచ్చారు కాబట్టి. ఎస్ ! గేమ్ ఛేంజర్ నయా షెడ్యూల్లో భాగంగా… వైజాగ్‌ వచ్చిన చెర్రీ అండ్ టీం.. అక్కడ వైజాగ్‌ బీచ్‌లో వేసిన బహిరంగ సభ సెట్టులో షూటింగ్‌కు వచ్చారు. అయితే ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్‌ అండ్ రామ్ చరణ్‌ బలగం.. కుప్పలు తెప్పలుగా ఆర్కే బీచ్‌కు వచ్చారు. బీచ్‌నే అల్లకల్లోలం చేసేశారు.

Published on: Mar 19, 2024 02:01 PM