Raju Weds Rambai: క్లైమాక్స్‌ కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చినట్టే

Updated on: Nov 21, 2025 | 6:24 PM

"రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ. అఖిల్ రాజ్, తేజస్వి రావుల అద్భుత నటన, సాయిలు దర్శకత్వం ఈ సినిమాకు జీవం పోశాయి. ఎమోషనల్ ఇంటర్వెల్ ట్విస్ట్, బలమైన ఫాదర్ సెంటిమెంట్, ముఖ్యంగా మనసును బరువెక్కిచే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. సురేష్ బొబ్బిలి సంగీతం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. ఇది ఒక హార్డ్ హిట్టింగ్ ప్రేమకథ.

అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా కొత్త దర్శకుడు సాయిలు తెరకెక్కించిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా నవంబర్ 21న విడుదలైంది. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దా.. కొన్ని సినిమాలు చూసినప్పుడు చాలా కాలం పాటు వెంటాడుతాయి.. రాజు వెడ్స్ రాంబాయి సినిమా కూడా అలాంటిదే. స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ కథ ఇది. ఎలాంటి కల్మషం లేకుండా సాగే ఈ ప్రేమ కథలో ఎన్నో మనసు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఒకే కథలో చాలా విషయాలు చెప్పాడు దర్శకుడు సాయిలు. ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్‌ అంత బాగానే వెళ్ళిపోతుంది. కాకపోతే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కేవలం హీరో డప్పు కొట్టినందుకు హీరోయిన్ ప్రేమలో పడుతుందనేలా చూపించడం కాస్త కన్విన్సింగ్‌గా అనిపించదు. కాకపోతే ఈ ఇద్దరి క్యారెక్టర్లో ఉన్న వాళ్ళ ఇన్నోసెన్స్ దాన్ని కాస్త ఓవర్‌ కమ్ చేసేసింది. రాజు వెడ్స్ రాంబాయిలో మరో కీ ఎలిమెంట్ ఇంటర్వెల్. ఎస్ ! ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.. ఫాదర్ సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండింది.. కీలకమైన సెకండ్ హాఫ్ వెరీ ఎమోషనల్ నోట్ లో వెళ్ళింది. ముందు నుంచి చెబుతున్నట్టుగానే క్లైమాక్స్ వెరీ హార్డ్ హిట్టింగ్.! ఎవరు ఊహించని ఒక బరువైన క్లైమాక్స్‌… మన మనసును మరింత బరువెక్కేలా చేస్తుంది. అయితే ఇలాంటి కథలు ప్రేక్షకులకు అంత ఈజీగా ఎక్కవు. దాన్ని ప్రమోట్ చేసుకునే విధానంలోనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మేకర్స్‌ బాగానే కష్టపడ్డారు. ఇక అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగా సాగదీశారు. సినిమా చూస్తుంటే.. చాలా చిన్న కథను.. సినిమా లెన్త్‌కు.. క్లైమాక్స్ వరకు లాగినట్టు అనిపిస్తుంది చూస్తుంటే..! అఖిల్ రాజ్, తేజస్వి రావు ఇద్దరు పోటీ పడి నటించారు.. శివాజీ రాజా, అనిత చౌదరి నటన కూడా బాగుంది.. ఇందులో చెప్పుకోదగ్గ మరో క్యారెక్టర్ చైతు జొన్నలగడ్డ.. హీరోయిన్ తండ్రి పాత్రలో ఆయన విశ్వరూపం చూపించాడు. మిగిలిన వాళ్ళందరు కూడా బాగా నటించారు. టెక్నికల్ వర్క్ చాలా బాగుంది. ముఖ్యంగా సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం చాలా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో దర్శకుడు సాయిలు హానెస్ట్ అటెంప్ట్ చేశాడు. వంశీ నందిపాటి మరొకసారి ఒక మంచి సినిమాను పిక్ చేశాడనే చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ క్లైమాక్స్ కనెక్ట్ అయ్యే దాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఇక ఓవరాల్ గా రాజు వెడ్స్ రాంబాయి గురించి చెప్పాలంటే.. వెరీ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్‌తో సింపుల్ ఫిల్మ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: ట్రోల్స్ కాదు..దిమ్మతిరిగేలా వ్యూస్‌ !! పెద్ది సూపర్ రికార్డ్

ప్రేమ మనిషిని చేస్తే.. బ్రేకప్ ‘పైరసీ కింగ్‌’గా మలిచింది

రూ 7.4 లక్షల నుంచి రూ 60 లక్షల ప్యాకేజ్‌కి .. టెకీ పోస్ట్ వైరల్

రైతు బిడ్డగా పుట్టి.. లక్ష కోట్ల కంపెనీ అధిపతిగా ఎదిగి

చందమామ మట్టిని తెచ్చేందుకు.. ముహూర్తం ఫిక్స్‌ !! అదే జరిగితే..