40 ఏళ్ల చరిత్ర ఉన్న రజినీ థియేటర్‌ ఇక నేల మట్టం

Updated on: Mar 14, 2025 | 6:27 PM

కాలం మారుతోంది. దానికి తగ్గట్టే సినిమా మేకింగ్ కూడా మారుతోంది. జనాలు సినిమాలు చూసే విధానం కూడా మారుతోంది. దీంతో సింగిల్ స్క్రీన్‌ థియేటర్లు కాస్తా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 40 ఏళ్ల చరిత్ర కలిగిన రజినీ కాంత్ థియేటర్‌ కూడా మరి కొన్ని రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే ఇప్పుడు చైన్నైలోని ఫిల్మ్ లవర్స్‌ను బాధిస్తోంది. రజినీ ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోంది.

ఇక అసలు విషయం ఏంటంటే.. చెన్నైలో బృందా పేరుతో ఓ థియేటర్‌ ఉంది. 1985లో రజినీ కాంత్ చేతుల మీదుగా ఈ థియేటర్‌ ప్రారంభమవడంతో.. ఈ థియేటర్‌ పేరు కాస్తా జనాల్లోకి రజినీ కాంత్ థియేటర్‌గా వెళ్లింది. అప్పటి నుంచి నిన్నా మొన్నటి వరకు ఈ థియేటర్‌ రజినీ థియేటర్‌గా రన్‌ అవుతూనూ ఉంది. ఈ క్రమంలోనే ఈ థియేటర్‌ను ఓ రియలెస్టేట్ సంస్థ చేజిక్కిచ్చుకుంది. 40 ఏళ్ల థియేటర్‌ను కూల్చేసి.. అక్కడ ఓ అపార్ట్‌ మెంట్ ను నిర్మించే ప్రయత్నాలు మొదలెట్టింది. దీంతో 40 వేళ్ల చరిత్ర కలిగిన రజినీ థియేటర్‌ మరి కొన్ని రోజుల్లో నేల మట్టం కానుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైతన్య కంటే ముందే శోభితకు లవ్‌ స్టోరీ! తెలిస్తే షాకవడం పక్కా..

అభిమానిని లాగిపెట్టి కొట్టిన స్టార్ హీరోయిన్

శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..?

నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!

పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే