Rajinikanth – Vijayakanth: ‘కెప్టెన్ సాయం నేను ఎప్పటికీ మరిచిపోను’ కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్.

|

Dec 31, 2023 | 12:03 PM

ప్రముఖ సీనియర్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ కాంత్‌ మరణం అందరినీ కలచివేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం అంటే డిసెంబర్‌ 28 ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం అంటే డిసెంబర్‌ 29 అధికారిక లాంఛనాలతో విజయ కాంత్‌ అంత్యక్రియలను నిర్వహించింది. లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.

ప్రముఖ సీనియర్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ కాంత్‌ మరణం అందరినీ కలచివేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం అంటే డిసెంబర్‌ 28 ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం అంటే డిసెంబర్‌ 29 అధికారిక లాంఛనాలతో విజయ కాంత్‌ అంత్యక్రియలను నిర్వహించింది. లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు కెప్టెన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. కెప్టెన్ అంతిమ సంస్కారాల్లో పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ కూడా తన మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమోషనల్ గా మాట్లాడారు.

“విజయకాంత్ కన్న మూశారని తెలిసి నా హృదయం ముక్కలైంది. కెప్టెన్‌ మరణం తమిళనాడు ప్రజలకు తీరని లోటు. ఆయనను డీఎండీకే మీటింగ్‌లో చివరిగా చూశాను. కోలుకున్నందుకు ఎంతో సంబరపడ్డాను. విజయకాంత్‌ స్నేహానికి ప్రతిరూపం. ఒక్కసారి అతనితో ఫ్రెండ్‌ షిప్‌ చేస్తే ఎవరూ మర్చిపోలేరు. మా ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉంది. నేను ఒకసారి హాస్పిటల్‌లో ఉంటే నన్ను చూడడానికి వేలాది మంది అభిమానులు వచ్చారు. వాళ్లను కంట్రోల్‌ చేయలేక ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు ఇబ్బందులు పడ్డారు. కానీ విజయ కాంత్ కేవలం 5 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆయన చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆఖరి రోజుల్లో విజయ్‌ కాంత్‌ను చూడడానికి నాకు వీలు కాలేదు. ఆయన లాంటి వాళ్లు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు” అని ఎమోషనల్‌ అయ్యారు రజనీకాంత్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.