Shruti Haasan: మహేష్‌ మూవీలో శృతి.. జక్కన్న నయా స్ట్రాటజీ

Edited By: Phani CH

Updated on: Nov 14, 2025 | 12:14 PM

రాజమౌళి ప్రాజెక్టుతో శ్రుతి హాసన్ అనూహ్య సహకారం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. నవంబర్ 15న కీరవాణితో కలిసి శ్రుతి ప్రదర్శించనున్న 'సంచారి' పాట గ్లోబల్ హైప్‌ను సృష్టిస్తోంది. సినిమా రిలీజ్‌ ప్రమోషన్లకు భిన్నంగా రాజమౌళి అనుసరిస్తున్న ఈ అంతర్జాతీయ వ్యూహం, అవతార్ వంటి చిత్రాలకు మించి ఆసక్తిని రేకెత్తిస్తూ సినీ ప్రియుల్లో అంచనాలను పెంచుతోంది.

ఏమాత్రం చడీచప్పుడూ లేకుండా రాజమౌళి ప్రాజెక్టుతో కొలాబరేట్‌ కావడం మామూలు విషయం కాదు. రియల్‌ సర్‌ప్రైజ్‌ అంటే ఇదే… అంటూ హ్యాపీగా ఉన్నారు శ్రుతిహాసన్‌ అభిమానులు. కీరవాణితో కలిసి నవంబర్‌ 15న శ్రుతి ఏం పెర్ఫార్మ్ చేస్తారో చూడ్డానికి సిద్ధమవుతున్నారు జనాలు. శ్రుతి ఏం పాడార్రా అంటూ అదే పనిగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. గ్లోబ్‌ ట్రాటర్‌ సాంగ్‌కి ఆమె ఎంత హుషారు యాడ్‌ చేశారోనని మాట్లాడుకుంటున్నారు. సంచారీ సాంగ్‌లో జస్ట్ ఫీల్‌ మాత్రమే కాదు, హీరో కేరక్టరైజేషన్‌, మూవీ థీమ్‌ అన్నీ కనిపిస్తున్నాయని డిస్కషన్‌ చేసుకుంటున్నారు. నవంబర్‌ 15న స్టేజ్‌ మీద శ్రుతి పెర్ఫార్మెన్స్ గురించి ఊరిస్తోంది టీమ్‌. కీరవాణి, అండ్‌ శ్రుతి ఈ సాంగ్‌ని ఎలా పెర్ఫామ్‌ చేస్తారో చూడ్డానికి జనాలందరూ వెయిటింగ్‌. పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే శ్రుతి పెర్ఫార్మెన్స ఏ రేంజ్‌లో ఉంటుందో ఆల్రెడీ టేస్ట్ చేశారు ఆడియన్స్. మామూలుగా సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఎవరైనా ప్రమోషన్లలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతారు. కానీ, ఇప్పుడు రాజమౌళి కంప్లీట్‌గా నయా స్ట్రాటజీని ఫ్రేమ్‌ చేస్తున్నారు. ఈవెంట్‌కే యూనిట్‌ మొత్తాన్ని ఏకం చేసి హైప్‌ పెంచేస్తున్నారు. ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ఈ మూవీ వైబ్‌ ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే అర్థమవుతోంది జనాలకు. అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న అవతార్‌ లాంటి సినిమాలకు కూడా ఈ రేంజ్‌ ఈవెంట్లు, ఈ రేంజ్‌ క్యూరియాసిటీ, పాజిటివ్‌ వైబ్‌ని ఇప్పటిదాకా విట్‌నెస్‌ చేయలేదనే అంటున్నారు మూవీ లవర్స్. జక్కన్న రూటే సెపరేటు అని మెచ్చుకుంటున్నారు నియర్‌ అండ్‌ డియర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..

రైలు కదిలిపోతోంది.. నా పైసలు ఇచ్చెయ్‌ అన్నా.. ప్లీజ్‌

వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే

చిన్న రక్త పరీక్షతో క్యాన్సర్ ముప్పు గుర్తింపు

అది రైలు బ్రో.. మన ఇల్లు కాదు.. అలా ఎలా చేస్తావ్ ??

Published on: Nov 14, 2025 12:14 PM