Pushpa2: ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్..
పుష్ఫ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమవుతోన్న చిత్ర యూనిట్.. అందుకు అనుగుణంగానే ప్రమోషన్స్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శుక్రవారం ముంబయిలో ఐకానిక్ ప్రెస్ మీట్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు..
ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ ఫిల్మి ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప2. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై ఆకాశన్నంటే అంచనాలు ఉన్నాయి. అంచనాలకు అనుగుణంగా సుకుమార్ పుష్ప2ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.
నేషనల్ వైడ్‌గా మంచి బజ్ సంపాదించుకున్న పుష్ప2. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. రిలీజ్‌కు అనుగుణంగానే ఈ సినిమా ప్రమోషన్స్‌ను జరుపుతోంది చిత్ర యూనిట్. ఇప్పటికే బిహార్‌లో మొదలైన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పుష్ప ఐకానిక్ ప్రెస్ మీట్ పేరుతో ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చిన ఈవెంట్‌కు సంబంధించిన లైవ్ వీడియోను ఇక్కడ చూసేయండి..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

