గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్స్ గ్యారంటీ

|

Dec 24, 2024 | 12:36 PM

ఈ మధ్య ఏదైనా సినిమా రిలీజ్‌ అయితే.. సామాన్యులు.. రివ్యూవర్లే కాదు.. సెలబ్రిటీలు.. డైరెక్టర్లు కూడా రివ్యూలిస్తున్నారు. సినిమా ఎలా ఉందనేది ట్విట్టర్లో తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే చేశారు. కానీ ఇంకా రిలీజ్ కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ గేమ్ ఛేంజర్ మూవీ ఎలా ఉందనేది చెప్పేశాడు.

తన రివ్యూతో.. ఒక్కసారిగా ఈ మూవీపై ఎక్కడలేని అంచనాలను పెంచేశాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య శంకర్ డైరెక్షన్లో చరణ్‌ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఫ్యాన్స్ లాంగ్ వెయిట్ తర్వాత జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా డల్లాస్‌లో జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన సుకుమార్.. ఫ్లోలో తను గేమ్‌ ఛేంజర్ మూవీ చూశానంటూ చెప్పేశారు. ఎస్ ! మెగాస్టార్ చిరుతో కలిసి గేమ్ ఛేంజర్‌ మూవీని చూశానని చెప్పిన సుక్కూ… గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్‌ అద్భుతం అంటూ.. పొగిడేశాడు. ఇంటర్వెల్‌ బ్లాక్ బస్టర్‌ అని.. ఇక సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ చూస్తే అందరికీ గూస్ బంప్స్‌ వస్తాయని.. ఇట్స్‌ ఫిమామినల్.. అని చెప్పాడు. అంతేకాదు జెంటిల్మెన్, భారతీయుడు సినిమాలను ఎంతగా ఎంజాయ్ చేశానో గేమ్‌ ఛేంజర్ మూవీని కూడా అంతే ఎంజాయ్ చేశానంటూ ఈ మూవీకి ఫస్ట్ రివ్యూవర్ అయిపోయాడు సుకుమార్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:.

Sukumar: ఈసారి నేషనల్ అవార్డ్‌ చరణ్‌కే.. తేల్చేసిన సుకుమార్‌