Prashanth Varma: ప్రశాంత్‌ వర్మ Vs నిర్మాతలు.. నిజమేనా ??

Updated on: Nov 02, 2025 | 8:41 PM

హిట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డిఫరెంట్ సిచ్యుయేషన్‌లో ఉన్నారు. జాంబి రెడ్డి, హనుమాన్‌ లాంటి బ్లాక్ బస్టర్స్‌ తరువాత ఈ యంగ్‌ డైరెక్టర్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటి పడ్డారు. తొందరపడి మరీ అడ్వాన్స్‌లు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్మాతల్లో ఎవరి నెంబర్‌ ముందొస్తుంది..? అసలు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లందరి సినిమాలు ప్రశాంత్ ఎప్పటికి పూర్తి చేయాలి? జాంబి రెడ్డి, హనుమాన్ సినిమాల సక్సెస్‌తో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌ డైరెక్టర్‌గా మారిపోయారు ప్రశాంత్ వర్మ.

వరుసగా రెండు బ్లాక్‌ బస్టర్స్‌ అందులోనూ ఓ పాన్ ఇండియా హిట్‌ కావటంతో ఈ యంగ్ కెప్టెన్‌ మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు. టాప్‌ ప్రొడ్యూసర్స్ అంతా క్యూలో నిలబడి మరీ ప్రశాంత్ తో సినిమా చేసేందుకు అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఆల్రెడీ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వరుసగా సూపర్ హీరో సినిమాలు ప్లాన్ చేసిన ప్రశాంత్‌ వర్మ, ఎవరికీ నో చెప్పకుండా అడ్వాన్స్‌లు తీసేసుకున్నారు. అందులో కొన్ని సినిమాలు ఎనౌన్స్ అయ్యాయి. మరి కొన్ని సినిమాలకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ప్రశాంత్ కొత్త ప్రాజెక్ట్ మాత్రం ఇంత వరకు స్టార్ట్ కాలేదు. ప్రశాంత్ వర్మ కొత్త సినిమా స్టార్ట్ చేయకపోవటంతో అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలు ఫీల్ అవుతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో కొన్ని సంస్థలు ముందుకు వచ్చి మేం అసలు అడ్వాన్స్‌లు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రశాంత్ లాంటి క్రేజీ డైరెక్టర్‌తో గ్యాప్‌ ఏ నిర్మాత కోరుకోరు కాబట్టి, ఎవరి ఇమేజ్‌ డ్యామేజ్‌ అవ్వకుండా నిర్మాతలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ కూడా సినిమాల విషయంలో సీరియస్‌గానే వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ తీసుకున్న అడ్వాన్స్‌లతో ఆ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్స్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ముందే ఏ స్క్రిప్ట్ ఫైనల్ అవుతుంది? ఏ సినిమా పట్టాలెక్కుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. ఈ వార్తలపై క్లారిటీ కోసం ప్రశాంత్‌ను సంప్రదించే ప్రయత్నం చేసిన ఆయన స్పందించలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిన్న వరద, నేడు బురద.. ఎటు చూసినా హృదయ విదారకమే

రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నవంబర్‌ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??

వినియోగదారులకు అలర్ట్‌.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!

అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుక ఫోటోలు వైరల్