ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కదలిక

Updated on: Oct 03, 2025 | 11:46 AM

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కదలికలు మొదలయ్యాయా..? ఇన్నాళ్లూ ఉన్న కన్ఫ్యూజన్ నుంచి ఈ దర్శకుడు బయటికి వస్తున్నాడా..? అందుకే తన యూనివర్స్ నుంచి ఒక్కో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నాడా..? అసలు ప్రశాంత్ వర్మ ఎన్ని సినిమాలు చేస్తున్నారు..? ఏది ముందొస్తుంది..? హనుమాన్ అనే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ.. దానికి ముందు అ..!, జాంబిరెడ్డితో గుర్తింపు వచ్చినా.. హనుమాన్‌తోనే ఆయన స్టార్ అయ్యారు.

దానికితోడు PVCU పేరుతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసారు ప్రశాంత్ వర్మ. అందులోనే హనుమాన్ సహా చాలా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈయనెన్ని సినిమాలు చేస్తున్నారనేది అందరికీ కన్ఫ్యూజనే. హనుమాన్ తర్వాత.. దానికంటే ముందు చాలా సినిమాలకు కమిటయ్యారు ప్రశాంత్ వర్మ. కొన్ని సినిమాలకు అడ్వాన్సులు తీసుకున్నారు. అందులో అధీర ఒకటి. నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా మొదలైన ఈ సినిమా నుంచి ఈ మధ్యే అప్డేట్ వచ్చింది. ఇందులో ఎస్‌జే సూర్య లుక్ రివీల్ చేసారు. తాజాగా మహాకాళి నుంచి అప్‌డేట్ వచ్చింది. PVCUలో భాగంగా మహాకాళి నుంచి శుక్రాచార్యుడి లుక్ విడుదల చేసారు. ఈ పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. మరోవైపు జై హనుమాన్‌ వర్క్ నడుస్తూనే ఉంది. ప్రభాస్ సినిమా కూడా లైన్‌లోనే ఉంది. వరస ప్రాజెక్ట్స్ ఓకే చేసారు గానీ వీటిని ప్రశాంత్ వర్మ ఎప్పటికి పూర్తి చేస్తారనేది ఇంట్రెస్టింగ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రన్‌వే పై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్‌

దేవర 2లో ఆ స్టార్ హీరో.. ఫ్యాన్స్‌కు పండగే..!

సంక్రాంతి ప్లానింగ్ నెక్ట్స్ లెవల్.. నవ్వి నవ్వి పోతారు

Deepika Padukone: తగ్గేదేలే అంటున్న దీపికా పదుకొనే..

దసరా సందడంతా డబ్బింగ్ సినిమాలదే