Dude: ఎట్టకేలకు డ్యూడ్ సినిమా OTTలోకి.. డేట్స్ ఫిక్స్

Updated on: Nov 12, 2025 | 1:58 PM

ప్రదీప్ రంగనాథన్ తాజా బ్లాక్‌బస్టర్ 'డ్యూడ్' సినిమా OTT విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండే ఈ మూవీ ఓటీటీ అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య వరుస హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ప్రదీప్.ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా దర్శకుడిగా తెరంగేట్రం చేసిన ప్రదీప్.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ప్రదీప్.. ఇప్పుడు డ్యూడ్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమాకు కొత్త డైరెక్టర కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత.. అందరి వెయిటింగ్ నడుమ.. ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్‌ 17న రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ.. డే వన్‌ నుంచి పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చేలా చేసుకుంది.బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ పై మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలోనే రిలీజ్ అయిన 30 రోజుల తర్వాత డ్యూడ్ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఫ్యాన్సీ రేట్‌కు డ్యూడ్ మూవీ రైట్స్‌ తీసుకున్న నెట్‌ప్లిక్స్‌ ఈ మూవీని నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ బయటికి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్‌ మూవీ నవంబర్ 14 నుంచి అందుబాటులోకి రానుందని.. నెట్‌ఫ్లిక్స్ తమ అఫీషియల్ ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు షేర్ చేసింది. దీంతో డ్యూడ్ మూవీ మరో సారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sharwanand: ఎట్టకేలకు విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వా

Abhishek Bachchan: నా హృదయం ముక్కలైంది.. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పోస్ట్

ఉన్న వివాదం చాలదన్నట్టు 3 కోట్లు పెట్టి మరో లగ్జరీ కారు అవసరమా

తమన్నాతో మెగాస్టార్ చిందులు.. అనిల్‌ మైండ్లో ఖతర్నాక్‌ ప్లాన్‌

నీ ఇష్టమొచ్చినప్పుడు దిగనీకి బిగ్ బాస్ ఏమన్నా బస్సా..’ శివాజీ ప్రశ్నల ధాటికి బిత్తర పోయిన రాథోడ్‌