Peddi vs Fauzi: పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
ఈ ఏడాది దసరాకు ప్రభాస్ ఫౌజీ అధికారికంగా విడుదల ఖరారైంది. గతంలో రామ్ చరణ్ పెద్ది దసరా రేసులో ఉందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెద్ది దసరాకు వస్తుందా లేక సమ్మర్‌కు వెళ్తుందా అనే చర్చ నడుస్తోంది. పండుగ సెలవులు కలిసి వస్తాయి కాబట్టి, రెండు మూడు సినిమాలు విడుదలైనా మంచి వసూళ్లు సాధించవచ్చని పరిశ్రమ అంచనా.
ఈ సంక్రాంతి విజయవంతంగా పూర్తయింది. సమ్మర్, డిసెంబర్ నెలల్లో ఇప్పటికే అనేక సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. రాబోయే సంక్రాంతి, సమ్మర్‌ను కూడా నిర్మాతలు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే, ఈ ఏడాది దసరాపై పెద్దగా దృష్టి పెట్టలేదనుకునే లోపే, ప్రభాస్ ఫౌజీ విడుదల తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అధికారికంగా ఈ ఏడాది దసరాకు విడుదలయ్యే తొలి చిత్రం ఫౌజీనే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ఒక విజువల్ వండర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ అనూహ్య ప్రకటనతో ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shraddha Kapoor: దీపిక రూట్లో శ్రద్ధ.. ఐకాన్‌స్టార్ కోసమేనా ??
Boyapati Sreenu: బోయపాటి ప్యాన్ ఇండియా ఫిల్మ్.. మరి రణ్‌వీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ??
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెంచిన సంక్రాంతి స్టార్స్