The Raja Saab: క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్‌.. మామూలుగా ఉండదు

Updated on: Jan 07, 2026 | 5:25 PM

ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' జనవరి 9న విడుదల కానుంది. తమన్ 'క్లైమాక్స్...ఐమ్యాక్స్...' పోస్ట్ వైరల్ అవ్వగా, యూఎస్ ప్రీమియర్స్ జనవరి 8న మొదలై $5 లక్షలు వసూలు చేశాయి. $1 మిలియన్ ఆశలు ఉన్నాయి. అయితే, కోలీవుడ్‌లో పోటీ కారణంగా, 'రాజా సాబ్' చెన్నైలో జనవరి 10న విడుదల కానుంది, ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

‘క్లైమాక్స్…ఐమ్యాక్స్.. మారుతి మ్యాక్స్’ అంటూ ‘ది రాజాసాబ్‌’కి సంబంధించి తమన్‌ పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘ది రాజాసాబ్‌’ జనవరి 9న విడుదల కానుంది. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌ నాయికలుగా నటించారు. మూవీ క్లైమాక్స్ వేరే రేంజ్‌లో ఉంటుందని చెప్పకనే చెబుతోంది తమన్‌ పోస్టు. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా యుఎస్ వసూళ్లు అదిరిపోతున్నాయి. జనవరి 8న ఈ సినిమా ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ఇప్పటికే అక్కడ 17500 టికెట్స్ బుక్ అయ్యాయి. దాదాపు 5 లక్షల డాలర్లు ఈ సినిమా వసూలు చేసింది. రిలీజ్ నాటికి 1 మిలియన్ క్రాస్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. కోలీవుడ్‌లో దళపతి ఎఫెక్ట్ ప్రభాస్‌ రాజాసాబ్ సినిమాపై స్పష్టంగా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య జనవరి 9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్‌కు .. అదే రోజు రిలీజ్ అవుతున్న జననాయగన్‌ కారణంగా చెన్నైలో ఒక్క థియేటర్‌ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజాసాబ్‌ టీం కోలీవుడ్‌లో మాత్రం తమ సినిమాను జనవరి 10 న రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభాస్‌ సినిమాకు మరీ ఇంత అన్యాయమా అనే కామెంట్ వస్తోంది సోషల్ మీడియాలో

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి

Thalapathy Vijay: బాలయ్య దెబ్బకు.. షాక్‌లోకి విజయ్‌ !! ట్రెండింగ్‌లో నటసింహం

Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ పెళ్లి పేరుతో ప్రచారం.. మళ్ళీ మొదటికొచ్చిన ప్రయత్నాలు

ఈవెంట్‌లో సీనియర్ నటికి పూనకం.. వైరల్ వీడియో

మెస్సీ Vs రొనాల్డో ‘వెయ్యి గోల్స్’ మొనగాడు ఎవరు ??