Prabhas: రెబల్ స్టార్ దెబ్బకు బేజారవుతున్న బాలీవుడ్ స్టార్స్.. బడా స్టార్స్ ని బీట్ చేసిన ప్రభాస్.

|

Jul 02, 2024 | 8:42 AM

కల్కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. భారతదేశంలోనే 95 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో ఈ సినిమా 24 కోట్లు వసూల్ చేసింది. విదేశాల్లో ఈ సినిమా దాదాపు 65 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. తొలిరోజు 190 కోట్ల వసూళ్లను కల్కి సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ రికార్డ్ ఇప్పటివరకు షారుక్ పేరు మీద ఉంది.

ప్రభాస్ కల్కి సినిమా అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్లోనూ హవా చూపిస్తోంది. ప్రభాస్‌ రికార్డులు చూసి బాలీవుడ్‌ స్టార్స్‌ బేజారవుతున్నారనే కామెంట్ బీ టౌన్‌లో వస్తోంది. కల్కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. భారతదేశంలోనే 95 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హిందీలో ఈ సినిమా 24 కోట్లు వసూల్ చేసింది. విదేశాల్లో ఈ సినిమా దాదాపు 65 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. తొలిరోజు 190 కోట్ల వసూళ్లను కల్కి సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ రికార్డ్ ఇప్పటివరకు షారుక్ పేరు మీద ఉంది. ఇక షారుక్ ఖాన్ రెండు సినిమాలు అద్భుతమైన కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద హిందీ సినిమా ప్రతిష్టను పెంచాయి. ఆయన సినిమాలు జవాన్, పఠాన్ 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ సినిమాలకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు కూడా ఆశ్చర్యపరిచాయి. షారుక్ నటించిన జవాన్ సినిమా విడుదలైన తొలిరోజే 125 కోట్లు రాబట్టింది. అలాగే పఠాన్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లు వసూలు చేసింది.

గత దశాబ్ద కాలంగా ఖాన్ సినిమాలు విదేశాల్లో విడుదల కావడం చాలా అరుదు. విడుదలైన ఇంత కలెక్షన్స్ ఎప్పుడూ రాలేదు. కానీ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఒక్క రోజులో 180 కోట్లు రాబట్టి బాలీవుడ్‌లోని పెద్ద సూపర్‌స్టార్‌లను వెనక్కి నెట్టింది. కల్కి 2898 AD సినిమా కలెక్షన్లతో ప్రభాస్ తన రికార్డును తానే బద్దలుకొట్టాడు. సాహో, సలార్ వంటి చిత్రాల తొలిరోజు కలెక్షన్లను కల్కి బీట్ చేసింది. కానీ తన సొంత సినిమా బాహుబలి రికార్డును మాత్రం బద్దలు కొట్టలేకపోయాడు డార్లింగ్. బాహుబలి 2 విడుదలైన మొదటి రోజున 217 కోట్ల రూపాయలు వసూలు చేసింది. RRR గురించి చెప్పాలంటే, ఓపెనింగ్ డే కలెక్షన్ 223 కోట్లు వసూల్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమానే నెంబర్ వన్ లో ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.