షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు
సంక్రాంతి పండుగ తర్వాత టాలీవుడ్ హీరోలంతా మళ్ళీ షూటింగ్స్‌తో బిజీగా మారారు. గత రెండు వారాలతో పోలిస్తే సినీ సందడి పెరిగింది. నాని, మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలు హలో నేటివ్ స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ, గండిపేట సహా పలుచోట్ల చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ప్రస్తుత తాజా అప్‌డేట్స్, హీరోల లొకేషన్స్ వివరాలు ఇక్కడ చూడండి.
సంక్రాంతి అయిపోయింది.. మన హీరోల్లో మళ్లీ జోష్ కనిపిస్తుంది.. సంక్రాంతి హీరోలు మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా సెట్స్‌లోనే బిజీగా ఉన్నారు. గత రెండు వారాలతో పోలిస్తే ఈసారి షూటింగ్స్ సందడి ఇంకాస్త పెరిగింది. మరి ఏ చిత్ర షూట్ ఎక్కడ జరుగుతుంది.. ఎవరెక్కడున్నారు.. ఖాళీగా ఉన్న హీరోలెవరో చూద్దామా..? ముందుగా హెలో నేటివ్ స్టూడియో అప్‌డేట్స్ చూద్దాం.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్ షూట్ అక్కడే జరుగుతుంది. ఇక MS రాజు సినిమా, సుడిగాలి సుధీర్ సినిమా, రాజహంస స్టూడియో నిర్మిస్తున్న జేడీ చక్రవర్తి సినిమా, శర్వానంద్ భోగి, దాసరి కళ్యాణ్ అధీరా సినిమాల షూటింగ్స్ అక్కడే జరుగుతున్నాయి. మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో 3 వారాలుగా నాన్ స్టాప్‌గా జరుగుతుంది. అల్లు అర్జున్ AA22 షూట్ ముంబైలోనే జరుగుతుంది. ఈ మధ్యే కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు టీం. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే 3 వారాలుగా జరుగుతుంది. అక్కడే యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు నీల్. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ బేగంపేట్ చిరాగ్ ఫోర్టులో.. విజయ్ దేవరకొండ రాహుల్ సంక్రీత్యన్ సినిమా షూటింగ్ గండిపేటలో.. నాగ చైతన్య వృషకర్మ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నాయి. ఇక అఖిల్ CCLలో ఆడుతూనే.. లెనిన్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.. ఈ చిత్ర షూటింగ్ RFCలో జరుగుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ranabali: రణబాలి రౌద్రం.. విజయ్ విశ్వరూపం
99 రూపాయల సినిమా.. సూపర్ ప్లాన్ గురూ
Lokesh Kanagaraj: లోకేష్ ప్రెస్ మీట్.. LCU సీక్రెట్స్ రివీల్
Andhra Pradesh: విశాఖ తీరంలో తండేల్ మూవీ సీన్ మరోసారి రిపీట్
AP Politics: రాజకీయ వేడిని పెంచిన వైసీపీ Vs టీడీపీ కామెంట్స్