Pooja Hegde video: నాలో అలంటి మార్పులు చాలా వచ్చాయి.. బుట్టబొమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!(వీడియో)
‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బుట్టబొమ్మ వరుస సినిమాలతో దూసుకెళ్లింది. టాలీవుడ్ యంగ్ బడా హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన బుట్టబొమ్మ వరుస సినిమాలతో దూసుకెళ్లింది. టాలీవుడ్ యంగ్ బడా హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా బడా సినిమాలతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌ను ఏలేందుకు సిద్ధమైన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అందాల తార మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
ఒక్క సినిమా సక్సెస్ కాగానే పారితోషికం పెంచేశానని రకరకాలుగా మాట్లాడుకున్నారని చెప్పిన ఈ బ్యూటీ, నేను అవన్నీ పట్టించుకోనని తేల్చి చెప్పింది. అయితే హీరోల పారితోషికం విషయంలో రాని చర్చలు, హీరోయిన్ల విషయంలో ఎందుకు వస్తాయని చర్చకు దారి తీశారు పూజా. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనలో చాలా మార్పులు వచ్చాయని చెప్పిన బ్యూటీ.. ఓర్పు, సహనం పెరిగాయని చెప్పుకొచ్చింది. ఆర్టిస్ట్‌ల కాంబినేషన్లో సీన్స్ తీసేటప్పుడు, చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందని.. సినీ పరిశ్రమలో సహనం చాలా అవసరం.
ఏ మాత్రం తేడా వచ్చినా పొగరుబోతు, కోపం ఎక్కువ ..అని ముద్ర వేస్తారని చెప్పుకొచ్చారు. ఇక తన శ్రమ, పట్టుదలకు అదృష్టం జత కావడం వల్లే ఈ రోజు ఇంత మంది అభిమానిస్తున్నారని తెలిపారు పూజా. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం బీస్ట్, రాధేశ్యామ్, ఆచర్యాతో పాటు బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Film Festival in Egypt: షాకింగ్ వీడియో.. ఫిల్మ్ ఫెస్ట్ హాల్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..
: Rishabh Pant: గ్రౌండ్ లోనే ఏడ్చేసిన పంత్.. ఆలస్యంగా బయటకి వచ్చి వైరల్ గా మారిన వీడియో..
AP Govt on theatres: ఏపీ థియేటర్లలో వందశాతం సీటింగ్‌కు అనుమతి..(వీడియో)