Dasari Sahithi: ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..

|

Apr 26, 2024 | 1:20 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారాలతో ఎన్నికల పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ బరిలో నిలిచిన నాయకులు నామినేషన్స్ దాఖలు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఈసారి సినీతారల తాకిడి ఎక్కువగా ఉంది. ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు పోటీపడుతుండగా.. మరికొందరు నాయకుల తరుపున ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారాలతో ఎన్నికల పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ బరిలో నిలిచిన నాయకులు నామినేషన్స్ దాఖలు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఈసారి సినీతారల తాకిడి ఎక్కువగా ఉంది. ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీనటులు పోటీపడుతుండగా.. మరికొందరు నాయకుల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల బరిలోకి మరో టాలీవుడ్ నటి దిగింది. సూపర్ హిట్ సిరీస్ పొలిమేర చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది సాహితి దాసరి. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఇక సాహితి పొలిమేర 1, పొలిమేర 2 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో కనిపించింది. అందర్నీ మెప్పించారు. ఇక పొలిమేర 2 సినిమాలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయిగా కనిపించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాల్లో పలు కీలకపాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాహితి.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 24న నామినేషన్ దాఖలు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!