పెద్ది అప్‌డేట్స్ విషయంలో సైలెన్స్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా దసరా అప్‌డేట్‌పై అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ వాయిదా పడటానికి కారణాలను మేకర్స్ వివరించారు. లిరికల్ వీడియోలో కొన్ని షాట్స్ పెండింగ్‌లో ఉండటం, బుచ్చిబాబు పర్ఫెక్షన్ కోసం ఆలస్యం చేస్తున్నారని తెలుస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు పెద్ది సినిమా నుంచి దసరా సందర్భంగా ఒక బిగ్ అప్‌డేట్ ఆశించారు. ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుందని ప్రచారం జరిగినా, పండుగ రోజు ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ ఆలస్యానికి గల కారణాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దసరాకు ఫస్ట్ సింగిల్ సిద్ధంగా ఉందని, లిరికల్ వీడియో రిలీజ్ ఖాయమని వార్తలు వచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జోరు చూపిస్తున్న రాజాసాబ్.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎలర్ట్ చేస్తున్న మేకర్స్
గుడ్ న్యూస్ చెప్పిన గీతా గోవింద్
OG: ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయన్న కెప్టెన్
