Peddi: పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. కారణం అదేనా
రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఐమాక్స్, డాల్బీ సినిమా, 4DX సహా పలు ప్రీమియం ఫార్మాట్లలో విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ 4DX షోలు అందుబాటులో లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్, స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 4DXలో అనుభవించాలని ఎదురుచూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పెద్దిగాడు సిల్వర్ స్క్రీన్ ను ఢీకొనబోతున్నాడు. బాక్సాఫీస్‌తో కుస్తీ ఆడేందుకు రెడీ అయిపోయాడు. ఇంకో పక్క ఫ్యాన్స్ కూడా రెడీ అయిపోయారు. పెద్ది విశ్వరూపాన్ని వెండితెరపై విట్ నెస్ చేయాలని ఉవ్విలూరుతున్నారు. ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం రెగ్యులర్ ఫార్మాట్‌లో కాకుండా… 4DX లాంటి డైమెన్షన్ వర్షన్‌లో పెద్దిని చూడాలని అనుకుంటున్నారు. అయితే ఈ ఫార్మాట్‌లో సినిమా చూద్దామని అనుకున్నవారికి ఇప్పుడో తీవ్ర నిరశా ఎదురైంది. పెద్ది మూవీ దాదాపు అన్ని వర్షన్స్‌లో రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఐమాక్స్, డాల్బీ సినిమా, 4DX, ఎపిక్, డీ -బాక్స్, పీసీఎక్స్,ICE,HDR,Barco laser.. ఇలా అన్ని ఫార్మాట్‌లో పెద్ది మూవీ రిలీజ్ అవుతుందని మేకర్స్ చెప్పారు. మేకర్స్ చెప్పినట్టే హైద్రాబాద్‌లో ఉన్న ఈ స్క్రీన్స్‌లో ఆడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే అందులో 4DX లేకపోవడంతో.. ఈ ఫార్మాట్‌లో పెద్దిని చూడాలనకున్న ఫిల్మ్ లవర్స్ డిస్పపాయింట్ అవుతున్నారు. తమ నిరాశను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక 4DX అనేది సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే ఒక అత్యాధునిక టెక్నాలజీ. సాధారణ థియేటర్లలో మనం సినిమాను కేవలం స్క్రీన్‌పై చూసి, స్పీకర్ల ద్వారా వింటాం. ఇది 2D లేదా 3D. కానీ 4DX థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు, స్క్రీన్‌పై జరిగే యాక్షన్‌ను మనం నిజంగా అనుభవించవచ్చు.సినిమాలో కార్ ఛేజింగ్ సీన్ ఉన్నా, హీరో ఫైట్ చేస్తున్నా, లేదా భూకంపం వచ్చినా… దానికి తగ్గట్టుగా థియేటర్ లోని సీట్లు ముందుకు, వెనుకకు, పైకి, కిందకు కదులుతాయి. హీరోకి తగిలే దెబ్బల వైబ్రేషన్‌ను కూడా మన సీటు వెనుక భాగంలో ఫీల్ అవ్వచ్చు. అంతేకాదు సినిమాలోని సీన్లకు అనుగుణంగా థియేటర్ లోపల ప్రత్యేక ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తారు. స్క్రీన్‌పై తుఫాను లేదా వేగంగా ప్రయాణించే సీన్లు వస్తే మీ ముఖంపైకి గాలి వస్తుంది.సినిమాలో వర్షం పడితే లేదా నీటి సీన్లు వస్తే మీపై లైట్‌గా నీటి చినుకులు పడతాయి .స్క్రీన్‌పై తోటలు, పువ్వులు లేదా కాఫీ వంటివి చూపించినప్పుడు థియేటర్‌లో ఆ సువాసన వస్తుంది. హర్రర్ సీన్లు, లేదా యాక్షన్ సీన్లలో థియేటర్ లోపల పొగ రావడం, మెరుపులు మెరవడం వంటి ఎఫెక్ట్ వచ్చేలా ఏర్పాటు చేస్తారు. యాక్షన్, అడ్వెంచర్, హర్రర్ మరియు యానిమేషన్ సినిమాలను 4DX లో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ది స్పోర్ట్స్ డ్రామా సినిమా.. అందుకే ఈసినిమా 4dxలో చూడాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఆ ఫార్మాట్ టికెట్స్ ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఇప్పుడు వారు నిరాశచెందారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు నష్ట పరిహారం
ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు
త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్
