PSPK – NBK: తేజు ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయిన పవన్.. వీడియో.
సినిమాల్లో తప్పించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా ఎమోషనల్ అయినట్టు.. కనిపించిన సందర్భాలే లేవు. కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్న దాఖలాలే లేవు. కాని ఫస్ట్ టైం ఓ షోలో..! ఆహా అన్‌స్టాపబుల్ షోలో...!
సినిమాల్లో తప్పించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్దగా ఎమోషనల్ అయినట్టు.. కనిపించిన సందర్భాలే లేవు. కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్న దాఖలాలే లేవు. కాని ఫస్ట్ టైం ఓ షోలో..! ఆహా అన్‌స్టాపబుల్ షోలో…! పవన్ ఎమోషనల్ అయ్యారు. తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి చెబుతూ.. బాధపడ్డారు. చావు అంచు వరకూ వెళ్లొచ్చాడంటూ.. అప్పటి పరిస్థితి గురించి బాలయ్యకు వివరించారు. ఎస్ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 షోకు వచ్చిన ఈయన.. చాలా విషయాల గురించి మాట్లాడారు. పర్సనల్ ప్రొఫెషనలే కాదు.. తన పొలిటికల్ జర్నీ.. ఫిల్మ్ జర్నీ గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. బాలయ్య అడిగిన ప్రశ్నలకు .. చూపించిన త్రో బ్యాక్ ఫోటోలకు నవ్వుతూ.. నవ్విస్తూ.. సిగ్గుపడుతూ.. మురిసిపోతూ సమాధానాలిచ్చారు.ఇక ఈ క్రమంలోనే బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సాయిధరమ్ యాక్సిడెంట్ గురించి చెప్పారు పవన్. ‘సాయిధరమ్‌కు యాక్సిడెంట్ అయితే అన్నీ నువ్వై చూసుకున్నావట గా..?’ అని బాలయ్య అడగగానే.. మన వాళ్లకు ఏమైనా అయిందని తెలిస్తే తెలియకుండా నా కాళ్లు ముందుకు పడతాయి.. వాళ్లను ఆ పరిస్థితుల నుంచి బయట పడేయాలనే ఆరాటం నాలో పెరుగుతుంది అని చెప్పారు పవన్. అంతేకాదు తేజు ఆసుపత్రి బెడ్ పై చావు బతుకుల్లో ఉంటే.. రైడింగ్ వెళ్లాడు. స్పీడు వల్లే పడ్డాడు అంటూ.. అందరూ కారు కూతలు కూశారన్నారు పవన్. అనడమే కాదు.. వాళ్లపై సీరియస్ అయ్యారు. అయితే ఈ క్రమంలోనే సాయిధరమ్ పరిస్థితి గురించి వివరిస్తూ.. ఎమోషనల్ అయ్యారు. ఆడియెన్స్ అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..