పాన్ ఇండియా డైరెక్టర్లు.. పక్కా లోకల్‌ సినిమాలు చేసేదెప్పుడు

Edited By:

Updated on: Nov 20, 2025 | 3:02 PM

పాన్ ఇండియా దర్శకులు భారీ చిత్రాలపైనే దృష్టి సారించి, స్థానిక, కంటెంట్ ఆధారిత చిన్న సినిమాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మర్యాదరామన్న వంటి చిత్రాలు నిరూపించినట్లు, తక్కువ బడ్జెట్‌లో కూడా అద్భుత విజయాలు సాధించవచ్చు. ఇది కొత్త దర్శకులకు మార్గదర్శనం చేయడమే కాకుండా, పరిశ్రమలో వైవిధ్యాన్ని పెంచుతుంది. మన దర్శకులు అప్పుడప్పుడు అలాంటి చిత్రాలు తీయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఎప్పుడూ గ్లోబల్‌ డయాస్‌ మీదే కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తూ ఏళ్లకు ఏళ్లు ఇట్టే ఖర్చయిపోతాయి. అప్పుడప్పుడన్నా లోకల్‌ మార్కెట్‌ మీద ఫోకస్‌ చేస్తే ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో మన కంటెంట్‌ని ఎలివేట్‌ చేయొచ్చు. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తున్నవారికి గైడెన్స్ ఇచ్చినట్టూ ఉంటుంది. ఇంతకీ మన ప్యాన్‌ ఇండియా దర్శకులు ఈ విషయాలను వింటున్నారా? ఒక్క సారి అంతర్జాతీయ స్థాయిని అందుకున్న తర్వాత కిందికి చూడటం మన దర్శకులకు సాధ్యం కాదా? భారీ సినిమాలు చేసిన తర్వాత చిన్న సినిమాలు చేయడమంటే నామోషీ అవుతుందా? అలాంటిదేమీ ఉండదు.. క్యూట్‌ కథని కాన్ఫిడెంట్‌గా చెప్పి కోట్లు లాభం చూడొచ్చని మర్యాదరామన్నలాంటి సినిమా ప్రూవ్‌ చేసింది కదా. అలాంటప్పుడు లోకల్‌ సబ్జెక్టులు, తక్కువ బడ్జెట్లు మన దర్శకులను ఎందుకు ఆకట్టుకోలేకపోతున్నాయి? అప్పుడప్పుడైనా ఆరామ్‌సే చోటా మోటా సినిమాలు, డ్రీమ్‌ ప్రాజెక్టులను క్విక్‌ గా తీసేయాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు? రంగస్థలం తర్వాత పుష్ప రెండు భాగాలు.. ఆతర్వాత ఇంటర్నేషనల్‌ రేంజ్‌ ఫ్రాజెక్ట్ అంటున్న సుకుమార్‌ని… ఆయన తరహా లవ్‌ స్టోరీతో చూడలేమా? మహానటి.. కల్కి అంటూ జోరు మీదున్న నాగ్‌ అశ్విన్‌ నుంచి ఎవడే సుబ్రమణ్యం లాంటి మనసుకు హత్తుకునే కథలను ఎక్స్ పెక్ట్ చేస్తున్నవారు చాలా మందే. అలాంటివారికోసమైనా సూపర్‌డూపర్‌ ప్రాజెక్టులకు కాస్త బ్రేక్‌ ఇచ్చి కంటెంట్‌ ఓరియంటెడ్‌ సబ్జెక్టులు చేయొచ్చుగా అనే రిక్వెస్టులూ ఉన్నాయి. ఇటు సందీప్‌ వంగాను, ప్రశాంత్‌ నీల్‌నూ, లోకేష్‌ కనగరాజ్‌నూ, అట్లీనూ అడుగుతున్నవారూ లేకపోలేదు. మీ సినిమాలు మీవే.. కాకపోతే అప్పుడప్పుడు మాకోసం సినిమాలు తీయండని అడుగుతున్నారు అప్‌కమింగ్‌ కెప్టెన్లు. ఎక్స్ పీరియన్స్డ్ డైరక్టర్లు చేసే క్యూట్‌ అండ్‌ స్మార్ట్ మూవీస్‌ని చూసి నేర్చుకోవాలన్నది వారిలో కనిపిస్తున్న క్యూరియాసిటీ. మరి ఈ రిక్వెస్టుల్ని వాళ్లు వింటారా?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాక్‌ ఉగ్ర కుట్రలు.. బిర్యానీ,దావత్ కోడ్ తో..

ఫ్లైఓవర్‌పై వేగంగా దూసుకెళ్లినకారు.. ఆ తర్వాత..

IPL 2026: ఐపీఎల్ 2026 వేలం ముహూర్తం ఫిక్స్..

అరె.. ముల్లు తీయడం ఇంత ఈజీనా.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలియక.. కష్టపడ్డానే

ఐ బొమ్మ రవి.. లైఫ్‌ స్టైల్‌ ఇదే !! డబ్బు సంపాదన అంటే ఎందుకంత కసి ??

Published on: Nov 20, 2025 02:06 PM