Sai Pallavi: కల్కి సీక్వెల్‌లో పల్లవి.. పాన్ ఇండియాకే ఫిక్సయ్యారా
సాయి పల్లవి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ సినిమా వార్తల తర్వాత, ఇప్పుడు కల్కి 2 లో దీపికా పదుకొనే పాత్ర కోసం పల్లవిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క శెట్టి పేరు వినిపించినప్పటికీ, చివరికి సాయి పల్లవికి ఈ అవకాశం దక్కినట్లు సమాచారం. ఇది ఆమె కెరీర్‌కు మరింత వేగాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో శరవేగంగా దూసుకుపోతోంది. హిందీలో వరుసగా చిత్రాలు చేస్తూ, దక్షిణాదిన కూడా భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తున్నారు. ఇటీవల రజినీకాంత్ సినిమాలో పల్లవి కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు రాగా, ఇప్పుడు కల్కి 2 లో కూడా ఆమెను ఎంపిక చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కల్కి సీక్వెల్‌లో దీపికా పదుకొనే పోషించిన సుమతి పాత్రకు ఎవరిని తీసుకుంటారనే దానిపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో అనుష్క శెట్టి సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలతో ఆమెకు ఈ అవకాశం దక్కిందని చాలా మంది భావించారు. అయితే, అనుష్క చివరి సినిమా “ఘాటీ” ఆశించినంత విజయం సాధించకపోవడం, ఆమె కెరీర్ అంత చురుకుగా లేకపోవడంతో, కల్కి 2 అవకాశం అనుష్కను కాదని సాయి పల్లవికి వరించిందని తాజా సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: స్టార్ట్ కాకముందే సందడి… ఐకాన్‌స్టార్‌తో లోకేష్ మేజిక్ గ్యారంటీ
TTD: టీటీడీ శ్రీవారి డాలర్లకు ఫుల్ డిమాండ్
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు.. డేంజరస్ వైరస్ భయమేనా ??
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు