A. R. Rahman: ఇలాంటి మూవీకి పనిచేయడం ప్రతి సంగీత దర్శకుడి కల

Updated on: Sep 02, 2025 | 4:12 PM

ఆస్కార్ అవార్డు గ్రహీత, ఏఆర్ రెహమాన్ ఒక అరుదైన చిత్రానికి సంగీతం అందించారు. సంభాషణలు లేకుండా కేవలం హావభావాలు, నేపథ్య సంగీతంతో నడిచే 'ఉఫ్ యే సియాపా' అనే మూకీ కామెడీ సినిమాకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఇలాంటి సినిమాకు పనిచేయాలని ప్రతి సంగీత దర్శకుడు కలగంటాడని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏ సంగీత దర్శకుడికైనా డైలాగులు లేకుండా కేవలం స్కోరుతో నడిచే సినిమా చేయడమనేది ఓ కల అని రెహమాన్‌ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ మూవీ ఛాన్స్‌ రాగానే వెంటనే ఒప్పుకున్నానన్నారు. డైరెక్టర్‌ జి అశోక్‌ కథ చెప్పిన తీరు తనను బాగా ఆకట్టుకుందని, ఆయనకు ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. తాను అశోక్‌కి కొన్ని ఐడియాలను ఇచ్చానని, రెండు పాటలు కూడా ముందే ఇచ్చానని చెప్పారు. ఆ తర్వాత మిగతా పాటలు సినిమా చూసిన తర్వాత కంపోజ్‌ చేశానని పేర్కొన్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే కేసరి లాల్ సింగ్ అనే వ్యక్తి, తన భార్య పుష్ప అపార్థం కారణంగా చిక్కుల్లో పడతాడు. పొరుగింటి అమ్మాయి కామినితో భర్తకు సంబంధం ఉందంటూ భార్య అతడిని విడిచి వెళ్లిపోతుంది. ఈ గందరగోళం సరిదిద్దుకునేలోపే, పొరపాటున వచ్చిన ఓ డ్రగ్స్ పార్శిల్, అనుకోకుండా ఇంట్లో శవాలు ప్రత్యక్షమవడం వంటి సంఘటనలతో అతని జీవితం తలకిందులవుతుంది. ఈ సమస్యల నుంచి కేసరి ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా కథ. కమల్‌ హసన్‌ నటించిన పుష్పక విమానం తర్వాత మళ్లీ ఇలాంటి సినిమా రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

LPG Price: గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

ఖాతాదారుల బంగారాన్ని స్వాహా చేసిన బ్యాంక్‌ మేనేజర్‌,క్యాషియర్‌

బయటి నుంచి వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకున్న వ్యక్తి.. కాసేపటికే నురగలు కక్కుతూ

Earthquake: భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

ల్యాబ్‌లో తయారైన మానవ కిడ్నీ..ఆశ్చర్యంగా పని చేస్తోంది