రూ.99/- కే టికెట్…! హిట్టు కొట్టేందుకు మనోడి నయా స్ట్రాటజీ

Updated on: Jan 30, 2026 | 1:25 PM

టాలీవుడ్‌లో టికెట్ ధరల పెంపు ట్రెండ్‌కు చెక్ పెడుతూ, ఇప్పుడు రేట్లు తగ్గుతున్నాయి. తరుణ్ భాస్కర్ నటించిన 'ఓం శాంతి శాంతి శాంతి' సినిమా ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. జనవరి 30న విడుదలవుతున్న ఈ చిత్రం సింగిల్ స్క్రీన్‌లలో ₹99, మల్టీప్లెక్స్‌లలో ₹150కి టికెట్లు అందిస్తోంది. తక్కువ ధరలతో ప్రేక్షకులకు దగ్గరై, విజయం సాధించాలని చిత్రబృందం ఆశిస్తోంది.

ఓ సినిమా రిలీజ్‌ అంటే.. టికెట్ రేట్స్‌ పెంపు హడావిడి కామన్ అన్నట్టుగా ఉండేది నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో.! కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కోర్టు మొట్టికాయలు.. ప్రజల నుంచి విమర్శలు.. వెరసి టికెట్ రేట్లు పెంచడం కాదు.. దిగే పరిస్థితి మొదలైనట్టుగా కనిపిస్తోంది ఇండస్ట్రీలో..! ఇక ఈ ట్రెండ్‌ను తామే మొదలెడుతున్నట్టుగా… తరుణ్ భాస్కర్ మూవీ టీం టాలీవుడ్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓ పక్క డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్.. ఎప్పటి నుంచో యాక్టర్‌గా కూడా సత్తా చాటుతున్నాడు. తన యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో అందర్నీ ఆట్టుకుంటున్నాడు. ఈక్రమంలోనే AR సీజవ్‌ డైరెక్షన్లో ఓం శాంతి శాంతి శాంతిః సినినిమా చేశాడు. ఈషా రెబ్బా తరుణ్‌కు జోడీగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్‌ కు రెడీ అయింది. జనవరి 30 వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ టీం తమ టికెట్ రేట్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిః టికెట్ రేట్లు.. సింగిల్ స్క్రీన్స్‌లలో 99రూపాయలు ప్లస్ జీఎస్టీ. మల్టీప్లెక్స్‌లలో 150రూపాయలు ప్లస్‌ జీఎస్టీగా నిర్ణయించింది. తక్కువ టికెట్ రేట్స్‌తో.. జనాలకు దగ్గరగా వెళ్లి హిట్టు కొట్టేలానే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ ప్రయత్నంలో ఈ మూవీ టీం సక్సెస్ అవుతోందో.. లేదో.. చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 5 ET: ఇక NTR విషయంలో జాగ్రత్త !! తారక్‌కు కోర్టు రక్షణ !!

Upasana: మెగా ట్విన్ బేబీస్‌ ఆహ్వానానికి ప్రత్యేక ఏర్పాట్లు

అర్ధరాత్రి నటితో అనుచిత ప్రవర్తన.. అసలేం జరిగింది ??

TG Vishwa Prasad: పాపం విశ్వ ప్రసాద్‌ !! ’15 సినిమాలు తీస్తే.. రెండే హిట్టు

Ram Charan: అక్కకు దిష్టి తగలకుండా చరణ్ స్పెషల్ గిఫ్ట్