SSMB29 సినిమా షూటింగ్ పై ఒడిశా డిప్యూటీ సీఎం ట్వీట్

Updated on: Mar 13, 2025 | 3:36 PM

జక్కన్న డైరెక్షన్లో మహేష్ చేస్తున్న SSMB29 నెట్టింట ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మహేష్ లుక్‌...! సినిమా షూటింగ్ లీక్! ఆ తర్వాత జక్కన్న రియాక్షన్ న్యూస్ ! వెరసి ఈ సినిమా రోజు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంది. అందరి నోళ్లలో నానుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి... ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిడ ట్వీట్ చేయడం తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు త్రూ అవుట్ ఇండియా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మహేష్ – జక్కన్న మూవీ షూటింగ్ ఎట్ ప్రజెంట్ ఒడిశాలోని కోరాపుట్‌ అడవుల్లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో మహేష్ తో పాటు.. కన్నడ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్‌, గ్లోబల్ స్టార్ ప్రియాంక కూడా పాల్గొంటున్నారు. దీంతో ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిడ ఓ ట్వీట్ చేశారు. గతంలో పుష్ప2 షూటింగ్ మల్కన్ గిరి లో జరిగిందని గుర్తు చేసిన ఈమె.. ప్రస్తుతం SSMB29 సినిమా షూటింగ్ కోరాపుట్‌లో జరుగుతుందని.. దీన్ని బట్టి చూస్తే ఒడిశా సినిమా చిత్రీకరణుకు స్వర్గధామం అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Thalapathy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే! దెబ్బకు మైండ్ బ్లాక్ కదూ

శంకర్‌కు బిగ్ రిలీఫ్! ఆయన 11 కోట్ల ఆస్తుల జప్తుకు బ్రేక్

TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్‌ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్

పెళ్లి రిసెప్షన్.. నమ్రత, చరణ్,ఉపాసన హంగామా

Ranya Rao: ఈ బంగారు లేడీ వెనకున్న మంత్రి ఎవరు?